Home బాక్సాఫీస్ వార్తలు All Time Top 10 Telugu Movies ‘ఆల్ టైం టాప్ 10’ టాలీవుడ్ తెలుగు...

All Time Top 10 Telugu Movies ‘ఆల్ టైం టాప్ 10’ టాలీవుడ్ తెలుగు మూవీస్ షేర్స్

top 10 telugu movies

టాలీవుడ్ సినిమా పరిశ్రమ పదకొండేళ్ల క్రితం దిగ్గజ దర్శకడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన తొలి పాన్ ఇండియన్ మూవీ బాహుబలి 1 భారీ సక్సెస్ తరువాత మరింతగా దేశవ్యాప్తంగా క్రేజ్, మార్కెట్ సాధించింది. ఆ తరువాత వచ్చిన బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి పాన్ ఇండియన్ మూవీస్ ఆ క్రేజ్ ని మరింత పెంచాయి. ఇక బాహుబలి సిరీస్ సినిమాలతో మరోవైపు హీరో ప్రభాస్ కూడా ఎంతో గొప్ప క్రేజ్, మార్కెట్ సొంతం చేసుకున్నారు.

అయితే అనంతరం చేసిన పలు సినిమాలతో ఆశించిన స్థాయి సక్సెస్ సొంతం చేసుకోలేకపోయిన ప్రభాస్ ఇటీవల వచ్చిన సలార్, కల్కి 2898 ఏడి మూవీస్ భారీ బ్లాక్ బస్టర్స్ కొట్టారు. అలానే అటు ఇతర హీరోలు సైతం పలు విజయాలతో కొనసాగుతున్నారు. అయితే విషయం ఏమిటంటే, మొత్తంగా ఇప్పటివరకు వచ్చిన టాలీవుడ్ సినిమాల్లో తెలుగు భాషలో అత్యధిక షేర్ సొంతం చేసుకున్న టాప్ 10 సినిమాల వివరాలు ఇప్పుడు చూద్దాం.

  1. ఆర్ఆర్ఆర్ – రూ. 365.80 కోట్లు
  2. బాహుబలి 2 – రూ. 310.00 కోట్లు
  3. కల్కి 2898 ఏడి – రూ. 289.95 కోట్లు
  4. సలార్ పార్ట్ 1 – రూ. 213.50 కోట్లు
  5. బాహుబలి 1 – రూ. 184.34 కోట్లు
  6. అలవైకుంఠపురములో – రూ. 159.18 కోట్లు
  7. సరిలేరు నీకెవ్వరు – రూ. 138.65 కోట్లు
  8. హనుమాన్ – రూ. 130.50 కోట్లు
  9. వాల్తేరు వీరయ్య – రూ. 129.20 కోట్లు
  10. సైరా నరసింహారెడ్డి – రూ. 123.91 కోట్లు

కాగా ఈ టాప్ 10 లిస్ట్ లో మొత్తంగా ప్రభాస్ నటించిన మూవీస్ నాలుగు ఉండడం విశేషం. మరి రాబోయే భారీ పాన్ ఇండియన్ అలానే రీజినల్ సినిమాల్లో వీటిని ఏవి అధిగమించి ముందుకు దూసుకెళ్తాయో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version