‘అఖండ – 3’ కూడా ఉంటుందట ?

    akhanda 2

    నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అఖండ 2. ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై గోపి ఆచంట, రామ్ ఆచంట గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీ యొక్క షూటింగ్ వేగంగా జరుగుతోంది.

    ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ పై నందమూరి ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలకృష్ణ అఘోర పాత్రలో అదరగొట్టనున్నట్లు చెప్తోంది టీమ్. అలానే తాజాగా రిలీజ్ అయిన అఖండ 2 టీజర్ కి మంచి రెస్పాన్స్ లభించి సినిమా పై బాగా అంచనాలు ఏర్పరిచాయి.

    అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీని ఒక ఫ్రాంచైజ్ గా తెరకెక్కించేందుకు టీమ్ సిద్దమైనట్లు తెలుస్తోంది. అందుకే అఖండ 2 క్లైమాక్స్ లో పార్ట్ 3 కి మంచి లీడ్ ఉంటుందని, అది తదుపరి మూవీ పై అందరిలో మరింతగా హైప్ ఏర్పరచడం ఖాయం అంటున్నారు.

    మరోవైపు ఈమూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ పనులు జరుగుతుండగా అనేక ఏరియాల్లో మంచి రేట్స్ కి ఈ మూవీ అమ్ముడయ్యే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న అఖండ 2 ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి. 

    Follow on Google News Follow on Whatsapp




    Show comments
    Exit mobile version