Home సినిమా వార్తలు ‘అఖండ  – 2’ క్రిస్మస్ కి వాయిదా పడనుందా ?

‘అఖండ  – 2’ క్రిస్మస్ కి వాయిదా పడనుందా ?

akhanda 2

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తాజాగా మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా అఖండ 2. ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన అఖండ సినిమాకి ఇది సీక్వెల్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే.

ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ సంస్థ పై గోపి ఆచంట, రామచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అందరిలో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. కాగా భారీ స్థాయిలో రూపొందుతున్న అఖండ 2 సినిమా ప్రస్తుతం వేగంగా షూటింగ్ అయితే జరుపుకుంటుంది.

కాగా విషయం ఏమిటంటే వాస్తవానికి ఈ సినిమాని దసరా పండుగ కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయాలని టీమ్ భావించింది కానీ ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కొంత లేట్ అవుతుందని అందుకే సినిమాని మరికొన్నాళ్లు వాయిదేసి ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోందని టాలీవుడ్ టాక్.

అయితే దీనికి సంబంధించి అఖండ 2 నుంచి కన్ఫర్మేషన్ మాత్రం రావాల్సి ఉంది. ఓవరాల్ గా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో పక్కాగా తెలియాలంటే మరికొద్ది రోజుల వరకు వెయిట్ చేయాలి. మరి అఖండ 2 తో బాలకృష్ణ, బోయపాటి ఎంతమేర సక్సెస్ అందుకుంటారో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version