ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న సాలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శృతిహాసన్ ఈరోజు షూటింగ్ పూర్తి చేసుకున్నారు ఈ అందాల నటి ఈ చిత్రం నుండి తన వంతు షూటింగ్‌ను ముగించిందని చిత్ర యూనిట్ అధికారికంగా సోషల్ మీడియాలో పంచుకుంది. కాగా శ్రుతి ‘సాలార్ ఎ స్పెషల్ ఫిల్మ్’ అని ఒక నోట్ రాసి ప్రకటించారు మరియు ప్రశాంత్ నీల్ మరియు భువన్ గౌడతో కలిసి ఉన్న ఫోటోని మనం చూడవచ్చు.
శ్రుతి హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. ఆమె షూట్‌ను ముగించినప్పుడు సెట్స్ నుండి కలర్‌ఫుల్ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో, ఆమె ప్రశాంత్ నీల్ మరియు భువన్ గౌడ భుజాలపై చేతులు వేసి ఉల్లాసంగా చిరునవ్వుతో ఫోటోకు పోజులివ్వడం మనం చూడొచ్చు. సినిమాలో ప్రభాస్ ప్రియురాలిగా ఆధ్య పాత్రలో శృతి హాసన్ కనిపిస్తారు.
కాగా ఇటీవల శృతి హాసన్ పుట్టినరోజు సందర్భంగా, నిర్మాతలు సాలార్ నుండి ఆమె పాత్రను ప్రదర్శించడానికి ప్రత్యేకమైన పోస్టర్‌ను పంచుకున్నారు. ఆ ప్రత్యేక పోస్టర్‌లో నటిని ఆద్యగా పరిచయం చేశారు. ఆమె సింపుల్ కుర్తాలో చాలా అద్భుతంగా కనిపించారు.
ఇటీవలి ఇంటర్వ్యూలో, నటి సాలార్‌లో పని చేయడం గురించి శ్రుతి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్తూ ఇలా పేర్కొన్నారు. “కెజిఎఫ్‌లో ప్రశాంత్ సర్ చేసిన పనిని నేను ఇష్టపడ్డాను మరియు నేను ఒక ప్రేక్షకురాలిగా మరియు నటిగా ఒక గొప్ప అనుభూతిని కలిగించే ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారని నేను భావిస్తున్నాను. నా జీవితంలో సాలార్‌లో ఈ క్యారెక్టర్ చేస్తున్న టైమ్ బెస్ట్ టైం ’’ అని తెలిపారు.
షూటింగ్ చివరి దశలో ఉన్న సాలార్ సినిమాకు మార్చి నెలాఖరు నుంచి ప్రచార కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందా లేదా అనే విషయం పై చాలా పుకార్లు ఉన్నాయి, మరి ఆ అనుమానాలు తీరాలంటే చిత్ర యూనిట్ నుండి అధికారిక ధృవీకరణ కోసం వేచి చూడాలి.