Homeసినిమా వార్తలు18 Pages: నిఖిల్ 18 పేజేస్ ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్ మరియు రిలీజ్ డేట్

18 Pages: నిఖిల్ 18 పేజేస్ ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్ మరియు రిలీజ్ డేట్

- Advertisement -

18 పేజెస్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను అందుకుని బాక్సాఫీస్ వద్ద డీసెంట్ బిజినెస్ చేసింది. కాగా జనవరి 27 తారీఖు నుంచి ఈ సినిమా రెండు ఓటీటీ ప్లాట్ ఫారంలలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. మొదటి ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా కాగా, రెండోది నెట్ ఫ్లిక్స్.

ఈ మేరకు ఈ సినిమా స్ట్రీమింగ్ పై రెండు ప్లాట్ ఫామ్ లు కూడా 18 పేజేస్ సినిమా స్ట్రీమింగ్ సమాచారాన్ని అధికారికంగా ప్రకటనలు విడుదల చేశాయి.

స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి కథ అందించారు. నిఖిల్ సిద్ధార్థ కథానాయకుడిగా నటించగా.. సుకుమార్ శిష్యుడు సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన చిత్రం ’18 పేజెస్’. నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ చిత్రం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, అందమైన పాటలతో యూత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.

READ  Pawan Kalyan: బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌ 2’లో 3 పెళ్లిళ్ల పై మాట్లాడిన పవన్ కళ్యాణ్

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. సిద్ధు పాత్రలో నిఖిల్ సిద్ధార్థ్, నందిని పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటించారు.

సిద్ధు (నిఖిల్ సిద్ధార్థ్) అనే యాప్ డెవలపర్ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె అతన్ని మోసం చేస్తుంది. ఈ కారణంగా సిద్ధు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఇక అలాంటి సమయంలో, అతనికి నందిని (అనుపమ పరమేశ్వరన్) డైరీ రోడ్డుపై దొరుకుతుంది.

ఆ డైరీని చదవడం మొదలు పెట్టిన సిద్ధు నెమ్మదిగా నందినితో ప్రేమలో పడతాడు. నందిని గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్న సిద్ధు ఆమెను వెతికే ప్రయత్నంలో కథలో పెద్ద ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ ఎంటి ? అతను ఆమెను చూశాడా? నందిని పట్ల సిద్ధు తన భావాలను వ్యక్తపరిచాడా? ఇదే ఈ సినిమా ప్రధానాంశం.

Follow on Google News Follow on Whatsapp

We are hiring passionate and enthusiastic content writers who can create original stories. If you are interested in full time, part time or freelancing, email us at jobs@tracktollywood.com. You need to work a 5 hour shift and be available to write articles. Kindly include your sample articles. Applications without sample articles will not be encouraged.

READ  Balakrishna: వీరసింహారెడ్డి సినిమా తొలిరోజు టాక్ మరియు ఓపెనింగ్స్ అంచనా

- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories