విజయ్ దేవరకొండకు జోడీగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమా షూటింగ్ త్వరలోనే పునఃప్రారంభమవుతుందని సమంత రుత్ ప్రభు తెలిపారు. గత ఏడాది మయోసైటిస్ అనే వ్యాధికి చికిత్స చేయించుకోవడంతో సమంత తన వర్క్ కమిట్ మెంట్స్ అన్నీ ఆపేయాల్సి వచ్చింది.
స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న తెలుగు రొమాంటిక్ డ్రామా ఖుషి గురించి బుధవారం ట్విట్టర్ ద్వారా అప్డేట్ ఇవ్వటం జరిగింది. విజయ్ దేవరకొండ అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత సమాధానమిస్తూ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభమవుతుందని, సినిమా ఆలస్యం అయినందుకు గానూ విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు కూడా తెలిపారు.
‘మహానటి’ తర్వాత విజయ్, సమంత జంటగా నటించిన రెండో చిత్రం ‘ఖుషి’. ఆ సినిమాలో వీరిద్దరి జోడీకి అటు విమర్శకులు ఇటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
మొదట ఖుషిని 2022 క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని భావించినా ఆ తర్వాత ఫిబ్రవరికి వాయిదా పడింది. ఇప్పుడు సమంత ఆరోగ్య సమస్యల కారణంగా మళ్లీ వేసవికి వాయిదా పడింది. ఇప్పుడు సమంత కోలుకున్నారని అయినా ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించాల్సి ఉందని అంటున్నారు. ఖుషి సినిమాకు సమంత డేట్స్ ఇవ్వడం లేదని చాలా రూమర్స్ వచ్చాయి. అయితే ఈ రోజు ఆమె తన ట్వీట్ ద్వారా ఇచ్చిన వివరణతో పుకార్లను ఖండించారు.
సమంత చివరిసారిగా తెలుగు యాక్షన్ థ్రిల్లర్ యశోదలో తెర పై కనిపించారు. ఈ చిత్రంలో సమంత డాక్టర్ వేషంలో ఉన్న క్రిమినల్ ముఠాను పట్టుకునే పనిలో ఉన్న సరోగేట్ తల్లిగా నటించారు. ఫస్ట్ వీకెండ్ తర్వాత కలెక్షన్లు భారీగా పడిపోయినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది.