షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో.. దీపికా పదుకొనె, జాన్ అబ్రహాం ముఖ్య పాత్రల్లో నటించిన ‘పఠాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధిస్తోంది. మంగళవారం దాదాపు 15 శాతం తగ్గుదలను చవిచూసినప్పటికీ ఈ చిత్రం ఏకంగా రూ.21 కోట్లు రాబట్టింది. సాధారణ వారం రోజుల్లో కలెక్షన్లు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ‘పఠాన్’ బాక్సాఫీస్ వద్ద మంచి ట్రెండ్ ను కొనసాగిస్తోంది.
అద్భుతమైన తొలి వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద ‘పఠాన్’ రూ.318 కోట్ల నెట్ వసూళ్లతో తొలివారం రన్ పూర్తి చేసుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం ఇప్పటికే హిందీలో ‘కేజీఎఫ్ 2’ ఫస్ట్ వీక్ హయ్యస్ట్ టోటల్ ను బీట్ చేసింది.
7 రోజుల వరకూ పఠాన్ ఓవరాల్ ప్రదర్శనను పరిశీలిస్తే ఊహించని రికార్డులు సాధించి హిందీ సినిమాల్లో ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ .634 కోట్ల గ్రాస్ వసూలు చేసింది, ఇందులో భారతీయ బాక్సాఫీస్ వద్ద నుంచి 395 కోట్లు రాగా, ఓవర్సీస్ వద్ద మొత్తం 239 కోట్లు వసూలు చేసింది.
తొలి వారం ముగిసే సరికి ‘పఠాన్’ ఇండియాలో 350 కోట్ల నెట్ ను క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ లలో ఈ సినిమా బ్రహ్మాండంగా బిజినెస్ చేసింది. రెండు మార్కెట్లు కూడా సినిమా వసూళ్లకు సానుకూల దోహదం చేశాయి. థియేట్రికల్ రన్ ముగిసే సరికి బాహుబలి 2 తర్వాత ఆల్ టైమ్ సెకండ్ హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న ‘కేజీఎఫ్ 2’ హిందీ వెర్షన్ కలెక్షన్లతో ‘పఠాన్’ పోటీ పడనుంది అని ట్రేడ్ వర్గాలు అనుకుంటున్నాయి.