స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ‘పుష్ప 2’ చిత్రం ‘ వేర్ ఈజ్ పుష్ప’ చిత్రంతో మరోసారి దేశాన్ని ఉర్రూతలూగించారు. ఈ గ్లింప్స్ ను ఒకేసారి పలు భాషల్లో విడుదల చేశారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోతో మిగతా సినిమా ఎలా ఉంటుందో దర్శకుడు సుకుమార్ తెలియజేశారు.
పైగా గ్లింప్స్ ను పరిశీలిస్తే సుకుమార్ ఈ కథకు అండర్ గ్రౌండ్ క్లూ ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్లింప్స్ లో టైటిల్ కార్డ్స్ అన్నీ రెడ్ కలర్ నుంచి గోల్డ్ కలర్ లోకి మారడం మామూలు విషయం కాదని, బహుశా సుకుమార్ సినిమాలో దీన్ని లింక్ చేసే కాన్సెప్ట్ ఉంటుందేమోనని సోషల్ మీడియాలో ప్రేక్షకులు అంటున్నారు. సుకుమార్ సినిమాల్లో టైటిల్స్ కి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆయన అలాంటి క్రియేటివ్ స్టయిల్ కి పెట్టింది పేరు.
ఇదిలా ఉంటే పుష్ప టీజర్ కు సోషల్ మీడియాలో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీ-సిరీస్ యూట్యూబ్ ఛానెల్ లో విడుదలైన ఈ వీడియో హిందీ వెర్షన్ కు తెలుగు వెర్షన్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. తెలుగు వీడియోకు 2.2 కోట్ల వ్యూస్ రాగా, హిందీ వెర్షన్ కు 3.6 కోట్ల వ్యూస్ వచ్చాయి.
దీన్ని బట్టి నార్త్ ఏరియాలో అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్, హైప్ తెలుస్తుంది. ఆయన పై ప్రేక్షకులకు ఉన్న అపారమైన ప్రేమకు నిదర్శనంగా ఈ వ్యూస్ ను చెప్పుకోవచ్చు. ఈ ట్రెండ్ చూస్తుంటే పుష్ప ది రూల్ హిందీ వెర్షన్ హిందీ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ సాధిస్తుందని, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కూడా అయ్యే అవకాశం ఎంతైనా చెప్పొచ్చు.
పుష్ప 2 లో రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ మొదటి భాగం లోని తమ పాత్రలలో కొనసాగనున్నారు. అనసూయ భరద్వాజ్, సునీల్ మరియు జగదీష్ కూడా ఈ సినిమాలో మొదటి భాగం నుండి అవే పాత్రలలో కనిపిస్తారు, జగపతి బాబు కొత్తగా చేరారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.