Homeసినిమా వార్తలుRanga Marthanda: ఓటీటీలో 'రంగమార్తాండ' కు ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్

Ranga Marthanda: ఓటీటీలో ‘రంగమార్తాండ’ కు ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్

- Advertisement -

ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం నటించిన రంగమార్తాండ సినిమా రెండు రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇప్పుడు ఓటీటీలో ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ఈ సినిమా ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 10 విభాగంలో మొదటి స్థానంలో ట్రెండింగ్ లో ఉంది. థియేటర్లలో విడుదలకు ముందే స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమాకు ఇండస్ట్రీ వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది. రిలీజ్ రోజున క్రిటిక్స్ కూడా ఈ సినిమాను మెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అంతగా వర్కవుట్ కాలేదు. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీలో ఈ చిత్రానికి తగిన గౌరవం లభిస్తోంది.

హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు.

READ  RRR: తెలుగు చిత్ర పరిశ్రమలో చారిత్రాత్మక ఘట్టం - ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆస్కార్ అవార్డు

ఈ చిత్రం మరాఠీ చిత్రం “నటసామ్రాట్” కు అధికారిక రీమేక్. రంగమార్తాండ అనే బిరుదు పొందిన ప్రముఖ రంగస్థల నటుడు రాఘవరావు కథే ఈ రంగమార్తాండ. రిటైర్ అయ్యాక చిన్న కూతురికి పెళ్లి చేసి తన ఆస్తిని పెద్ద కొడుకు భార్యకు ఇచ్చి ప్రశాంతంగా విశ్రాంత జీవితం గడపాలనుకుంటాడు. అయితే పరిస్థితులు అందుకు అనుగుణంగా జరగక పోవడంతో కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ తర్వాత రాఘవరావు, అతని భార్య ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనేది మిగతా కథ.

Follow on Google News Follow on Whatsapp

We are hiring passionate and enthusiastic content writers who can create original stories. If you are interested in full time, part time or freelancing, email us at jobs@tracktollywood.com. You need to work a 5 hour shift and be available to write articles. Kindly include your sample articles. Applications without sample articles will not be encouraged.

READ  Vinaro Bhagyamu Vishnu Katha: ఓటీటీలో ప్రసారం అవుతోన్న కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ

- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories