Home సినిమా వార్తలు Liger Trailer Launch event: భారీ స్థాయిలో జరగనున్న లైగర్ ఈవెంట్

Liger Trailer Launch event: భారీ స్థాయిలో జరగనున్న లైగర్ ఈవెంట్

సినిమా హీరోలపై అభిమానులు ఎంత ప్రేమ చూపిస్తారో, ఏ స్థాయిలో వారి పై పిచ్చి ప్రేమను పెంచుకుంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ అభిమాన హీరోల సినిమా విడుదలవుతుందంటే చాలు, పండగ వాతావరణంలా సందడి చేస్తారు. థియేటర్ల వద్ద భారీ కటౌట్‌లు పెట్టి పాలాభిషేకం చేస్తారు. అంతే కాక డప్పులు కొడుతూ డాన్స్ కూడా చేసి తమ ఆనందాన్ని చూపిస్తారు.

అయితే సినిమా విడుదలకు ముందు థియేటర్‌ల వద్ద కటౌట్‌లు పెట్టడం సాధారణమే. ఇటివల కాలంలో ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లకు సైతం హీరోల కటౌట్‌లు పెట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ భారీ కటౌట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో యువతరం ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ మరియు అభిమానాన్ని సంపాదించుకున్నారు హీరో విజయ్ దేవరకొండ.అలాగే గీత గోవిందం, డియర్‌ కామ్రెడ్‌ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని ఎర్పరచుకున్నారు. విజయ్‌ దేవరకొండ తొలి పాన్‌ ఇండియా చిత్రంగా రాబోతుంది ‘లైగర్‌’ సినిమా ఆగస్టు 25న విడుదల అవుతున్న నేపథ్యంలో ఆ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను రేపు విడుదల చేయటానికి చిత్ర యూనిట్ అన్ని సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. విజయ్‌ దేవరకొండ సరసన హీరోయిన్ గా బాలీవుడ్‌ భామ అనన్య పాండే నటించిన ఈ సినిమా పై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఈ సినిమా ఆగస్ట్‌ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌, సాంగ్స్‌కు అద్భుతమయిన స్పందన లభించింది.

ఇక ‘లైగర్’ సినిమా ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని సుదర్శన్‌ 35 ఎమ్‌ఎమ్‌ థియేటర్‌లో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు సుమారు 75 అడుగుల విజయ్ దేవరకొండ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేయడం విశేషం. జాతియ జెండాను కప్పుకున్న బాక్సర్‌గా విజయ్ దేవరకొండ కటౌట్‌ అబ్బురపరిచేలా ఉంది. ఈ సినిమా ట్రైలర్ ను గురువారం (జులై 21) ఉదయం 9:30 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version