Home సినిమా వార్తలు Thank you movie: సినిమా నిడివి తగ్గించిన చిత్ర బృందం

Thank you movie: సినిమా నిడివి తగ్గించిన చిత్ర బృందం

అక్కినేని నాగ చైత‌న్య హీరోగా నటించిన తాజా సినిమా “థాంక్యూ”. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి దిగ్గజ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ సహా నిర్మాతగా వ్యవహరిస్తుంది. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై దిల్‌ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. జూలై 22న సినిమా విడుదల కానుంది.

ఈ చిత్రంలో నాగ చైతన్య ఓకే పాత్రలో మూడు విభిన్న షేడ్స్‌లో కనిపించనున్నారు. రాశీ ఖన్నా, మాళవికా నాయర్‌, అవికా గోర్‌ హీరోయిన్లుగా నటించారు. ఇదిలా ఉండగా ఈ శ‌నివారం చిత్ర యూనిట్ వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించింది. మొదట్లో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగినా.. ఆ తరువాత ఈ సినిమాకి సరైన విధంగా ప్రచారం జరగలేదని.. నిర్మాత దిల్ రాజు పై అక్కినేని అభిమానులు కాస్త అలక బూనిన మాట వాస్తవం.

ఆ విషయం అలా ఉంచితే.. ఇటీవల ఈ సినిమా నిడివి గురించిన ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. 2:51 నిమిషాలు అంటే దాదాపు మూడు గంటల నిడివి “థాంక్యూ” సినిమా ఉండబోతోందనే వార్త విని అక్కినేని అభిమానులు కాస్త ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే అంత నిడివి ఉంటే..సినిమా ఎంతో అత్యద్భుతంగా ఉంటేనే అంత నిడివి ఉన్నా బోర్ కొట్టకుండా ప్రేక్షకులు ఆనందించే అవకాశం ఉంటుంది.

మరి థాంక్యూ లాంటి ఫీల్ గుడ్ సినిమాకి అంత నిడివి అనవసరం అన్న మాటలు వినిపించగా.. ఆ సూచనలు అన్నీ పరిగణలోకి తీసుకుని చిత్ర యూనిట్ సినిమా నిడివిని రెండు గంటల తొమ్మిది నిమిషాలకు (2 hr 9 mins) కుదించినట్లు తెలుస్తుంది.

దర్శకుడు విక్రమ్ కుమార్ ఇదివరకు తీసిన అన్ని చిత్రాలు కూడా ఎక్కువ నిడివి గలవే. మనం,24, గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాలు అన్నీ ఆ కోవకు చెందినవే. మరి తక్కువ నిడివి వల్ల “థాంక్యూ” సినిమాకు మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version