Home సినిమా వార్తలు నా సినిమా నీకు.. నీ సినిమా నాకు అంటున్న తెలుగు హీరోలు

నా సినిమా నీకు.. నీ సినిమా నాకు అంటున్న తెలుగు హీరోలు

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో సినిమా వద్దకు చేరడం అనేది సర్వ సాధారణం. ఇక ఇలాంటి సినిమాలు కొన్ని సార్లు సూపర్ హిట్ కూడా అవుతాయి, కోన్ని అట్టర్ ఫ్లాప్ లు కూడా అవుతాయి. ముందుగా దర్శకుడు ఒక హీరోను దృష్టిలో పెట్టుకుని కథను రాసుకున్నప్పటికీ .. ఒక్కోసారి హీరోకి ఆ కథ నచ్చకపోవడం, లేదా డేట్స్ సర్దుబాటు అవ్వకపోవడం వంటి కారణాలతో అదే కథలో కొన్ని మార్పులు చేసి ఇంకో హీరోతో సినిమా తీయడం లాంటివి చాలా సార్లు జరిగింది.

ఉదాహరణకు గతంలో వచ్చిన “మనసంతా నువ్వే” సినిమాని తీసుకుంటే.. ఆ సినిమాలో హీరో ఉదయ్ కిరణ్ అన్న విషయం తెలిసిందే. కానీ ఆ చిత్రం రూపు దాల్చే ముందు మహేష్ బాబును హీరోగా నిర్మాత ఎం ఎస్ రాజు అనుకున్నారట. అయితే కొన్ని కారణాల వలన మహేష్ ఆ సినిమా చేయలేదు అనుకోండి.. అది వేరే విషయం. అలాగే మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లోనే ఒక మైలురాయి గా నిలిచిన సినిమా “ఖైదీ”. సినిమాని మొదట సూపర్ స్టార్ కృష్ణ గారితో చేద్దాం అనుకున్నారు.

అయితే ఇన్నేళ్ల తరువాత మళ్ళీ తెలుగు చిత్రసీమలో ఒక హీరో సినిమా మరో హీరోకు వెళ్లడం అనే కొత్త ట్రెండ్ మొదలయింది. అల్లు అర్జున్ – కాంబినేషన్లో వచ్చిన “పుష్ప” సినిమా కథ ముందుగా మహేష్ వద్దకు వెళ్ళింది. అయితే ఇతర సినిమాల డేట్స్ క్లాష్ అవడం వంటి కారణాలతో ఆ సినిమా నుంచి మహేష్ తప్పుకున్నారు. ఇక అల్లు అర్జున్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చేయాల్సిన కథ చేతులు మారి జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్నారు.

ఇక పన్నెండేళ్ళ తరువాత మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కథ కూడా మొదట ఎన్టీఆర్ తో అనుకున్నదే. కానీ ప్రి ప్రొడక్షన్ దశలోనే ఆ చిత్రం కూడా చేతులు మారింది. ముందుగానే చెప్పుకున్నట్లు ఇలా హీరోలు మారిన సినిమాలు ఒక్కోసారి బ్లాక్ బస్టర్ లు అవుతాయి అలాగే భారీ డిజాస్టర్లు గా కూడా నిలుస్తాయి. మరి చిత్రీకరణలో ఉన్న ఈ పెద్ద హీరోల సినిమాలలో ఏవి హిట్ లు అవుతాయో, ఎవి పరాజయం పాలవుతాయో, ఎవరి అదృష్టం ఎలా ఉందో చూద్దాం.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version