Homeసినిమా వార్తలుZombie Reddy Sequel Confirmed 'జాంబీ రెడ్డి' సీక్వెల్ కన్ఫర్మ్

Zombie Reddy Sequel Confirmed ‘జాంబీ రెడ్డి’ సీక్వెల్ కన్ఫర్మ్

- Advertisement -

టాలీవుడ్ యువ కథానాయకుడు తేజ సజ్జ హీరోగా యువ దర్శకుడు ప్రశాంత వర్మ దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కిన హర్రర్ కామెడీ యాక్షన్ జానర్ మూవీ జాంబిరెడ్డి. ఈ మూవీ అప్పట్లో మంచి విజయవంతం అయింది. డిఫరెంట్ కాన్సెప్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా జానర్ అప్పటివరకు మన తెలుగులో రాలేదు. 

ఇక జాంబీరెడ్డి విజయవంతం అనంతరం మరొకసారి తేజ, ప్రశాంత్ వర్మ కలిసి చేసిన సినిమా హనుమాన్. అది మరింత బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి వారిద్దరి కాంబోకి మరింత క్రేజ్ తీసుకువచ్చింది. ఇక ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ కుమారుడైన మోక్షజ్ఞతో ఒక సినిమా అలానే జై హనుమాన్, ఈ రెండు సినిమాల ప్లానింగ్ లో ఉన్నారు ప్రశాంత్ వర్మ. దీని అనంతరం లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం జాబిరెడ్డికి సీక్వెల్ కూడా ప్రశాంత్ వర్మ తెరకెక్కించేందుకు సిద్ధం అయ్యారు. 

అయితే అది దాని స్క్రిప్ట్ ని సిద్ధం చేసిన ప్రశాంత్ వర్మ ఇతర దర్శకునికి దాని యొక్క దర్శకత్వ బాధ్యతని అప్పగించనున్నారని తెలుస్తోంది. అలానే దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ కూడా రేపు బయటకు రానుందట. కొద్దిసేపటి క్రితం ఈ విషయమై హీరో తేజ సజ్జ పెట్టిన బ్లాస్టింగ్ ఎమోజిల ట్వీట్ తో అది ఆల్మోస్ట్ స్పష్టం అయింది. మరి జాంబీ రెడ్డి సీక్వెల్ ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. 

READ  Prabhas Fauji Release on that Time ప్రభాస్ ​'ఫౌజీ' రిలీజ్ అయ్యేది అప్పుడే ?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories