టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ సిద్దార్థ హీరోగా ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన భారీ పాన్ ఇండియన్ మూవీ కార్తికేయ 2 తెలుగు, తమిళ్ తో పాటు హిందీలో కూడా అదరగొట్టి నటుడిగా ఆయనకు మంచి తీసుకువచ్చింది. దాని అనంతరం నిఖిల్ చేసిన 18 పేజెస్ మూవీ పర్వాలేదనిపించగా ఆపై వచ్చిన స్పై మూవీ డిజాస్టర్ గా నిలిచింది.
ఇక తాజగా నిఖిల్ హీరోగా కన్నడ అందాల నటి రుక్మిణి వసంత్ హీరోయిన్ గా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్, యాక్షన్ రొమాంటిక్ మూవీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ పై బివిఎస్ఎన్ ప్రసాద్ గ్రాండ్ లెవెల్లో నిర్మించగా సన్నీ ఎం ఆర్ సంగీతం అందించారు. అయితే మంచి అంచనాలతో తాజగా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ఓపెనింగ్ డేనే బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది.
ఇక ఈ మూవీ చూసిన వారందరూ కూడా ఇది ఓటిటి లో డైరెక్ట్ గా రిలీజ్ చేసుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ యొక్క కథ, కథనాలు ఏమాత్రం ఎంగేజింగ్ గా లేకపోవడంతో పాటు ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయలేదు. మొత్తంగా అయితే ఈ మూవీ కూడా నిఖిల్ ఖాతాలో డిజాస్టర్ గా నిలవనుంది.