Homeసినిమా వార్తలుYoung Director wish to do More Movies with Venkatesh వెంకటేష్ తో మరిన్ని...

Young Director wish to do More Movies with Venkatesh వెంకటేష్ తో మరిన్ని మూవీస్ చేయనున్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ 

- Advertisement -

ఇటీవల అనిల్ రావిపూడి తీసిన సంక్రాంతికి వస్తున్నాం మూవీతో కెరీర్ పరంగా అతి పెద్ద విజయం సొంతం చేసుకున్నారు విక్టరీ వెంకటేష్. అలానే ఈమూవీ తో కెరీర్ పరంగా రూ. 300 కోట్ల గ్రాస్ క్లబ్ లో కూడా చేరారు వెంకీ. కాగా ఈ మూవీతో ఒక్కసారిగా సీనియర్ స్టార్ హీరోగా మరింత క్రేజ్ సొంతం చేసుకున్న వెంకటేష్ ప్రస్తుతం మరోవైపు రానా నాయుడు సీజన్ 2 లో నటిస్తున్నారు. 

తాజాగా ఈ సిరీస్ యొక్క టీజర్ రిలీజ్ అయింది. అయితే మ్యాటర్ ఏమిటంటే, ఇటీవల వెంకటేష్ తో ఎఫ్ 2, అలానే ఎఫ్ 3 తో పాటు తాజాగా సంక్రాంతికి వస్తున్నాం తో హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్న యంగ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ తన లైఫ్ లో వెంకటేష్ గారి మూవీస్ చాలా చూస్తూ పెరిగానని అన్నారు. 

ఆయన మూవీస్ ఎక్కువగా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉండడంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని మరింతగా అలరిస్తాయని అన్నారు. అలానే వెంకటేష్ తో తన కెరీర్ పరంగా మొత్తం పది సినిమాలు చేయాలనేది తన కోరిక అని అన్నారు అనిల్. ఇక త్వరలో మెగాస్టార్ చిరంజీవి తో అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీ చేయనున్న విషయం తెలిసిందే.

READ  Game Changer Hindi Good Openings Ready 'గేమ్ ఛేంజర్' హిందీ : మంచి ఓపెనింగ్ కి రెడీ    

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories