టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1 చేస్తున్నారు. దీని పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.
ఈ మూవీని సెప్టెంబర్ 27న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. విషయం ఏమిటంటే, త్వరలో ఎన్టీఆర్ తో రెండు పార్టుల యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని యువ దర్శకుడు శౌర్యువ్ తీయనున్నారని, ఇది ఎంతో గ్రాండ్ లెవెల్లో రూపొందనుందని రెండు రోజులుగా మీడియా మాధ్యమాల్లో కథలు వైరల్ అయ్యాయి. కాగా వాటిలో పార్ట్ 1 మూవీ 2028లో అలానే పార్ట్ 2 మూవీ 2030లో రిలీజ్ అవుతాయని మరికొందరు ప్రచారం చేసారు
అయితే తాజాగా వాటిపై స్పందించిన శౌర్యువ్, ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం అని, వాటిని ఎవరూ నమ్మవద్దని అన్నారు. కాగా తనకు ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని తెలిపారు. మొత్తంగా శౌర్యువ్ క్లారిటీతో ఈ పుకార్లకు పూర్తిగా చెక్ పడింది.