కన్నడ నటుడు రాకింగ్ స్టార్ యష్ హీరోగా ఇటీవల ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ సిరీస్ సినిమాలు రెండూ కూడా ఒకదానిని మించేలా మరొకటి ఎంతటి గొప్ప విజయాలు సొంతం చేసుకున్నాయి మనకు అందరికీ తెలిసిందే.
అలానే నటుడిగా ఆ మూవీస్ రెండూ కూడా యష్ కి క్రేజ్ ని అలానే మార్కెట్ ని ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెంచాయి. ముఖ్యంగా ఇండియన్ మార్కెట్ లో ఆయనకు భారీ క్రేజ్ ఉంది. ఇక ప్రస్తుతం లేడీ డైరెక్టర్ జీతూ మోహన్ దాస్ తో యష్ చేస్తున్న మూవీ టాక్సిక్. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ దీనిని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న టాక్సిక్ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచింది. కాగా ఈ మూవీని పాన్ వరల్డ్ రేంజ్ లో నిర్మిస్తున్నారట మేకర్స్.
ఇటు పాన్ ఇండియన్ భాషలతో పాటు అటు ఇంగ్లీష్ తో పాటు ఇతర ఇంటెర్నేర్శనల్ భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారట. మొత్తంగా టాక్సిక్ మూవీతో మేకర్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.