ఉపేంద్ర ప్రధాన పాత్రలో కిచ్చా సుదీప్ ముఖ్య అతిథ పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం కబ్జా ఈ వారం విడుదలై దారుణమైన కలెక్షన్లు, పేలవమైన సమీక్షలతో ప్రారంభమైంది. శ్రియ హీరోయిన్ గా, శివరాజ్ కుమార్ మరో అతిథి పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది.
కేజీఎఫ్ తరహా ఇతివృత్తాన్ని ప్లాన్ చేసిన కబ్జా టీమ్ సీక్వెల్ ను ముందే ప్రకటించింది. సినిమాలో కూడా కథా రచయితలు సీక్వెల్ కు కావాల్సినంత స్కోప్ క్రియేట్ చేశారు కానీ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేక పోయింది. ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ దిశగా దూసుకు పోతోంది.
రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇతర భాషల నుండి కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. టాప్ స్టార్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో స్టార్ కాస్ట్ కూడా విఫలమైంది అనే చెప్పాలి.
ఇక మొదటి భాగానికి ఇంతటి పేలవమైన ఆదరణ లభించడం అంటే రెండో భాగాన్ని పక్కన పెట్టడమే శ్రేయస్కరం అవుతుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లాక్ బాహుబలి, కేజీఎఫ్, పుష్ప విషయంలో చూసినట్లుగా పార్ట్ 1 సక్సెస్ కావడం చాలా ముఖ్యం. కానీ కబ్జా ఎలాంటి ఆసక్తిని క్రియేట్ చేయకపోవడంతో సీక్వెల్ కోసం ఉత్సాహం చూపే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.