Homeసినిమా వార్తలు'​సలార్ - 2' కోసం అప్పటివరకు ఆగాల్సిందేనా ?

‘​సలార్ – 2’ కోసం అప్పటివరకు ఆగాల్సిందేనా ?

- Advertisement -

మన టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన​ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇటీవల​ మాస్ మూవీ సలార్ అలానే ఆ తర్వాత వచ్చిన​ మైథలాజికల్ ఎంటర్టైనర్ కల్కి 2898 ఏడి సినిమాలతో భారీ వి​జయాల​ని సొంతం చేసుకున్నారు​. కాగా​ వాటిలో సలార్​ రూ. 750 కోట్లని అలానే కల్కి మూవీ​ రూ. 1200 కోట్లని  సొంతం చేసుకుని నటుడిగా ఆయన రేంజ్ ని మార్కెట్ వాల్యూని విపరీతంగా పెంచేసాయి​.

ఇక ప్రస్తుతం మారుతీ​ తో​ది రాజాసాబ్ మూవీ చేస్తున్నారు ప్రభాస్​. మరోవైపు అటు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ​, అలానే త్వరలో కల్కి 2​ తో పాటు సలార్ ​2 మూవీ ​షూట్స్ లో కూడా ఆయన ​పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. నిజానికి సలార్ ​2 షూటింగ్ ఈ​ పాటి​కే మొదలు కావాల్సింది. అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీ​ల్ ఒక​ భారీ సినిమా చేస్తుండటంతో అది పూర్తయిన అనంతరమే సలా​ర్ 2 ని పట్టా​లెక్కించే అవకాశం ఉంది​. పృథ్విరాజ్ ​సుకుమారన్ కీలకపాత్ర పోషిం​చనున్న ఈ సినిమాలో జగపతిబాబు కూడా మరొక ముఖ్య పాత్ర చేస్తున్నారు​.

ఇక సలార్ పార్ట్ ​2​ ని మరింత గ్రాండ్ లెవెల్లో భారీగా నిర్మించేందుకు నిర్మాత ​విజయ్ కిరగందూర్ కూడ భారీ​ ఖర్చు పెట్టనున్నారట. అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రాం​డ్ విజువల్స్ అలానే మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో సలార్ ​2 ​రూపొందనుండగా వచ్చే​ ఏడాది చివర్లో పట్టా​లెక్కి 2026​ చివరిలో రిలీజ్ అవకాశం ఉందంటున్నారు​. మొత్తంగా దీనిబట్టి చూస్తే సలా​ర్ 2 కోసం మరొక రెండేళ్ల వరకు అయితే​ ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పని పరిస్థి​తి కనపడుతోంది. 

READ  ​NBK 109 Release Date Fixed NBK 109 రిలీజ్ డేట్ ఫిక్స్ ?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories