Home సినిమా వార్తలు Victory Venkatesh: విక్టరీ వెంకటేష్ హిట్ యూనివర్స్‌లో భాగమవుతారా?

Victory Venkatesh: విక్టరీ వెంకటేష్ హిట్ యూనివర్స్‌లో భాగమవుతారా?

దర్శకుడు శైలేష్ కొలను ‘హిట్’సినిమాతో మంచి పేరు పొందారు. కాగా ఆ చిత్రం తాలూకు రెండవ భాగంతో కూడా తన విజయ పరంపరను కొనసాగించారు. అలాగే ఈ ఫ్రాంచైజీలో నాని ప్రధాన నటుడిగా మూడవ భాగాన్ని కూడా ప్రకటించారు.

అయితే ప్రతిభావంతులైన ఈ దర్శకుడు ‘హిట్ 3’ని ప్రారంభించేలోపు మరో ప్రాజెక్ట్‌కి పని చేస్తారని వర్గాలు చెబుతున్నాయి. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం, శైలేష్ కొలను విక్టరీ వెంకటేష్‌తో కలిసి పని చేస్తారనీ.. మరియు ఈ సినిమా హీరోగా వెంకటేష్ కి 75 వ ప్రాజెక్ట్ కావడం విశేషం.

హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ వెంకటేష్‌తో సినిమా కోసం చేతులు కలపనున్నారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో ఒక సందేహాన్ని రేకెత్తించింది. అదేంటంటే.. ఈ సినిమా ఒక స్టాండ్‌లోన్ మూవీ అవుతుందా లేదా హిట్ యూనివర్స్‌లో భాగమవుతుందా అని ప్రేక్షకులు ఇప్పుడు ఆలోచిస్తున్నారు.

వెంకటేష్ గనక హిట్ సీరీస్ లో భాగం అయితే అది ఖచ్చితంగా ప్రేక్షకుల అంచనాలను మరో స్థాయికి పెంచుతుంది. అలాగే, ఈ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో భాగమయితే వెంకటేష్‌కి ఒక రకంగా ఎంతో ప్రత్యేకమైన పాత్ర అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

దర్శకుడు శైలేష్ కొలను సినిమాలన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేకుండా చక్కని థ్రిల్లర్లుగా తెరకెక్కించబడ్డాయని మనకు తెలుసు. ఇటీవలే ‘నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌ పై ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాన్ని నిర్మించిన వెంకట్ బోయనపల్లి ఈ ప్రాజెక్ట్‌ను నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న రెండో సినిమా ఇది.

విక్టరీ వెంకటేష్ తన కెరీర్‌లో మాస్ బ్యాక్ డ్రాప్ ఉన్న కొన్ని చిత్రాలను చేసారు. అయితే ఆయన ఎక్కువగా కుటుంబ ఆధారిత చిత్రాలతో పాటు కథానాయికలకు ప్రాముఖ్యత ఉన్న చిత్రాలతోనే అద్భుతమైన విజయాలను అందుకున్నారు.

వెంకటేష్ అభిమానులు ఆయనను ఒక పక్కా మాస్ పాత్రలో చూడటానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు మరియు ఆయన హిట్ యూనివర్స్‌లో భాగమయ్యారనే వార్త సరైనదని తేలితే అది వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

మరి దర్శకుడు శైలేష్ కొలను, హీరో విక్టరీ వెంకటేష్ ల కాంబినేషన్ లో ఒక మంచి సినిమా రావాలని కోరుకుందాం.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version