వెంకటేష్, రానా కలిసి తొలిసారిగా నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఇటీవల ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ వెబ్ సిరీస్ కు పేలవమైన రివ్యూలు వచ్చాయి. ఇంగ్లిష్ వెబ్ సిరీస్ రే డోనోవన్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ యాక్షన్ క్రైమ్ డ్రామాలో వెంకటేష్, రానా తండ్రీ కొడుకులుగా నటించారు.
రానా నాయుడు వెబ్ సిరీస్ విడుదలై పేలవమైన రివ్యూలు తెచ్చుకోవడంతో వెంకటేష్ బ్రాండ్ ఇమేజ్ పై కూడా ప్రభావం చూపింది. ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న ఆయన ఇలాంటి అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న సీరీస్ లో చేయడం ఏమిటని అందరూ విమర్శించారు. మరి ఈ స్పందన తరువాత వెంకటేష్, రానాలు మళ్ళీ రానా నాయుడు రెండో సీజన్ కు వెళ్తారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న.
మొదటి సీజన్ 10 ఎపిసోడ్లను కలిగి ఉంది, ఇది రే డోనోవన్ యొక్క మొదటి సీజన్ కంటే రెండు ఎపోసొడ్లు తక్కువ. ఒరిజినల్ షో మొత్తం 7 సీజన్లను కలిగి ఉంది మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన సమీక్షలు మరియు ఆదరణ పొందింది. కానీ రానా నాయుడుకు పేలవమైన రివ్యూలు రావడంతో ప్రేక్షకులు, నిర్మాతలు కూడా భవిష్యత్ సీజన్ల వైపు పెద్దగా మొగ్గు చూపడం లేదన్నట్లుగానే ప్రస్తుత పరిస్థితి కనిపిస్తుంది.
కరణ్ అన్షుమన్ రూపొందించిన ఈ సిరీస్ లో రానా తండ్రి నాగా పాత్రలో వెంకటేష్ నటించారు అమెజాన్ ప్రైమ్ వీడియో షోలు ఇన్సైడ్ ఎడ్జ్, మీర్జాపూర్లను రూపొందించినందుకు గానూ కరణ్ కి మంచి పేరుంది. సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ఆశిష్ విద్యార్థి, రాజేష్ జైస్ తదితరులు రానా నాయుడు వెబ్ సిరీస్ లో కీలక పాత్రల్లో నటించారు.