Home సినిమా వార్తలు ఈ వారం సినిమాలు ఇండస్ట్రీ ఆశలు నిలబెడతాయా?

ఈ వారం సినిమాలు ఇండస్ట్రీ ఆశలు నిలబెడతాయా?

Positive Buzz On Both Releases Macherla Niyojakavargam And Karthikeya 2

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ చక్కని దశలో ఉంది. బింబిసార మరియు సీతా రామం రెండు సినిమాలు భారీ విజయంతో పరిశ్రమకు ఎంతో కాలం తరువాత సంతోషాన్ని ఇచ్చాయి. వరుస ఫ్లాపులతో తీవ్ర భాధలో ఉన్న అందరికీ నిట్టూర్పుని అందించాయి. ఈ రెండు చిత్రాలు విజయం సాధించిన కారణంగా, ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న నితిన్ సినిమా మాచర్ల నియోజకవర్గం, మరియు నిఖిల్ నటించిన కార్తికేయ 2 చుట్టూ కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి.

మాచర్ల నియోజకవర్గం రేపు థియేటర్లలో విడుదలవుతుండగా, కార్తికేయ 2 ఎల్లుండి అంటే ఆగస్టు 13న విడుదలవుతోంది. మాచర్ల నియోజకవర్గం సినిమాకు హీరో నితిన్ మరియు చిత్ర యూనిట్ చాలా ప్రచారం చేశారు. అందుకు వారు ప్రచార కార్యక్రమాలలో వ్యవహరించిన తీరే కారణం.. అద్భుతమైన ప్రచార వ్యూహాలతో పాటు సినిమాలోని పాటలు, విడియో ప్రోమోలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ సినిమాని ప్రేక్షకులకు చేరువగా ఉండేలా చేసుకున్నారు. ముఖ్యంగా రారా రెడ్డి పాట విపరీతంగా ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ పాటలో హీరోయిన్ అంజలి నర్తించడం మరో విశేషం.

ఇక 2014లో వచ్చిన సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ కార్తికేయకు సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ 2 పై కూడా ప్రేక్షకులు మరియు ట్రేడ్ వర్గాలలో భారీ అంచనాలు ఉన్నాయి. సెకండ్ పార్ట్ లో కథ ఎలా ఉంటుందో . ఈసారి హీరో ఏ రహస్యాన్ని చేదిస్తాడో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టే ట్రైలర్ ఉండి సినిమా పై ఆశలు పెంచింది. నిఖిల్ కెరీర్‌ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన తెరకెక్కిన ఈ సినిమా మొత్తం 5 భాషల్లో విడుదలవుతోంది.

ఇక ఈ రెండు చిత్రాలు చూడటానికి ప్రేక్షకులు ఏ రకంగా అయితే ఎదురు చూస్తున్నారో.. వాటి పై ఏర్పడిన హైప్ కారణంగా, ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు కూడా గత వారం లానే ఈ వారంలో కూడా విడుదలైన రెండు సినిమాలు కూడా విజయం సాధించాలని, సాధిస్తాయనే ఆశతో ఉన్నారు. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఉన్న ఈ జోరు ఇలాగే కొనసాగి, ఈ వారం కూడా రెండు సినిమాల ద్వారా లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు. ఈ రెండు సినిమాలు అన్ని ప్రాంతాలలో మంచి వసూళ్లను రాబడతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఆ అంచనాలు నిజం అవుతాయా లేదా రేపటితో తేలిపోతుంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version