Homeసినిమా వార్తలుPathaan: షారుఖ్ ఖాన్ పఠాన్ హిందీలో కేజీఎఫ్ 2 ఓపెనింగ్ రికార్డును బ్రేక్ చేస్తుందా?

Pathaan: షారుఖ్ ఖాన్ పఠాన్ హిందీలో కేజీఎఫ్ 2 ఓపెనింగ్ రికార్డును బ్రేక్ చేస్తుందా?

- Advertisement -

కేజీఎఫ్ 2 హిందీ సినిమాలలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారతదేశంలో దాని హిందీ వెర్షన్ నుండి తొలిరోజు 54 కోట్ల నెట్ ను సాధించింది, ఇప్పుడు షారుక్ యొక్క పఠాన్ అడ్వాన్స్ బుకింగ్స్ లో చూపిస్తున్న జోరును కొనసాగిస్తే ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది మరియు సినిమాకు కూడా పాజిటివ్ టాక్ కూడా అవసరం.

నాలుగేళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ వెండితెర పైకి రీఎంట్రీ ఇస్తుండటంతో పఠాన్ కు అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని చోట్లా బ్రహ్మాండంగా ఉన్నాయి. అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు తరలిరావడానికి బాక్సాఫీస్ వద్ద భారీ బాణాసంచా పేల్చడానికి ఈ ఒక్క కారణం చాలు.

పఠాన్ సినిమా కై పాక్షిక అడ్వాన్స్ బుకింగ్ బుధవారం ప్రారంభమైంది. దీనికి అద్భుతమైన స్పందన లభించింది, కాగా దేశవ్యాప్తంగా థియేటర్ల యజమానులను నుండి అనుకున్న షెడ్యూల్ కంటే ముందుగానే బుకింగ్ ప్రారంభించడానికి ప్రేరేపించింది. గురువారం కూడా అడ్వాన్స్ బుకింగ్ లో జోరును కొనసాగించిన పఠాన్ 24 గంటల్లో 1.7 లక్షలకు పైగా టిక్కెట్లు విక్రయించి రికార్డు సృష్టించింది.

READ  Rohit Shetty: రోహిత్ శెట్టికి పెద్ద షాక్ ఇచ్చిన బాలీవుడ్ ప్రేక్షకులు

శుక్రవారం నుంచి పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, దేశవ్యాప్తంగా ఈ సినిమాకు డిమాండ్ కొనసాగుతోంది. పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్ అనే మూడు జాతీయ చైన్లలో పఠాన్ మొదటి రోజు 1.7 లక్షల టికెట్లను విక్రయించగా.. నిన్నటి రాత్రి వరకూ దాదాపు 2 లక్షల టికెట్ల అమ్మకాలతో ఈ చిత్రం మూడు జాతీయ మల్టీ ప్లెక్స్ చైన్లలో రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ను ముగించింది.

https://twitter.com/taran_adarsh/status/1616640973278449667?t=YjkNpqHwPvcDAJNHKzC_4w&s=19

పఠాన్ మంగళవారం నాటికి హృతిక్ రోషన్ వార్ ను బీట్ చేసి మొత్తంగా బాలీవుడ్ సినిమాకు బిగ్గెస్ట్ అడ్వాన్స్ సాధించేలాగా కనిపిస్తుంది. మరి కెజిఎఫ్ 2 సినిమా రేంజ్ లో ఓపెనింగ్ వస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అడ్వాన్స్ బుకింగ్ పరంగా చూసుకుంటే పఠాన్ కు నాన్ హాలిడే ఓపెనింగ్ రికార్డు గ్యారంటీ లానే ఉంది.

ఈ సినిమాకి లభిస్తున్న అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ దృష్ట్యా ఈ సమయంలో రూ.40 కోట్ల వసూళ్లు ఖాయమని అనిపించినా, దీపికా పదుకొనే, జాన్ అబ్రహాం లు ముఖ్య పాత్రల్లో.. షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు రూ.45-50 కోట్ల ఓపెనింగ్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Follow on Google News Follow on Whatsapp

READ  Bandla Ganesh: త్రివిక్రమ్ పై మరొసారి పరోక్షంగా సెటైర్ వేసిన బండ్ల గణేష్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories