ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2 ది రూల్. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్నారు.
ప్రకాష్ రాజ్, జగపతిబాబు, ఫహాద్ ఫాసిల్, రావు రమేష్, సునీల్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్న పుష్ప 2 మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై బాగా అంచనాలు ఏర్పరిచాయి. డిసెంబర్ 6న పుష్ప మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది. విషయం ఏమిటంటే, హిందీలో మన తెలుగు సినిమాల మార్కెట్ రోజురోజుకు మరింతగా పెరుగుతోంది. ముఖ్యంగా బాహుబలి 2 మూవీ ఇండియాలో హిందీ వర్షన్ రూ. 700 కోట్లు కొల్లగొట్టింది.
అలానే తాజాగా శ్రద్ధ కపూర్ ప్రధాన పాత్ర చేసిన స్త్రీ 2 మూవీ ఓవరాల్ గా ఇండియాలో రూ. 600 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం కనపడుతోంది. కాగా పుష్ప 2 మూవీ కనుక మంచి టాక్ సొంతం చేసుకుంటే ఇండియాలో హిందీ వర్షన్ రూ. 1000 కోట్లని రాబట్టే సత్తా ఉందని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. ఇప్పటికే ఈ మూవీకి ఇండియా మొత్తం అన్ని భాషల ఆడియన్స్ లో భారీ స్థాయి అంచనాలు ఉండడం మంచి అడ్వాంటేజ్ అని చెప్పాలి. మరి రిలీజ్ అనంతరం పుష్ప 2 మూవీ ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.