పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి 2898 ఏడి మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి సూపర్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. యువ దర్శకడు నాగ అశ్విన్ తెరకెక్కించిన ఈ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీలో దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించగా వైజయంతి మూవీస్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీ ప్రస్తుతం ఇంకా అనేక ప్రాంతాల్లో బాగానే కలెక్షన్ రాబడుతోంది.
ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్కి మూవీ ఇప్పటికే రూ. 165 కోట్ల షేర్ ని రాబట్టగా వరల్డ్ వైడ్ తెలుగు వర్షన్ రూ. 250 కోట్లకు పైగా రాబట్టే అవకాశం ఉంది. ఇక మరోవైపు త్వరలో రిలీజ్ కానున్న భారీ పాన్ ఇండియన్ సినిమాల్లో పుష్ప 2 కూడా ఒకటి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సుకుమార్ తెరకెక్కిస్తుండగా దీనిని డిసెంబర్ 6న గ్రాండ్ గా పలు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. పుష్ప 2 పై తెలుగు సహా అన్ని భాషల ఆడియన్స్ లో ఎన్నో అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.
కాగా మ్యాటర్ ఏమిటంటే, కల్కి 2898 తో పాటు కెజిఎఫ్ 2, బాహుబలి 2 వంటి సినిమాల రికార్డులని పుష్ప 2 బ్రేక్ చేసే ఛాన్స్ ఉందనేది పలువురు ప్రేక్షకాభిమానుల అభిప్రాయం. కాగా ఒకరకంగా ఇది పుష్ప 2 కి పెద్ద టార్గెట్ అని చెప్పాలి. మరి ఆ టార్గెట్ ని ఎంతవరకు పుష్ప 2 రీచ్ అవుతుందో తెలియాలి అంటే మరికొన్ని నెలలు ఆగాలి.