Homeసినిమా వార్తలు'ఓజి' అంచనాలు అందుకునేనా ?

‘ఓజి’ అంచనాలు అందుకునేనా ?

- Advertisement -

పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస యాక్షన్ తో కూడిన గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ ఓజి. ఈ మూవీలో ఓజాస్ గంభీర అనే గ్యాంగ్ స్టర్ గా నటిస్తుండగా విలన్ గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తుండగా ఇతర కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రీయారెడ్డి, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు.

ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకోగా తాజాగా ఫైర్ స్టార్మ్ అనే పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసారు. కాగా ఈ సాంగ్ మంచి రెస్పాన్స్ సంపాదించింది. కాగా గడచిన 24 గంటల్లో ఈ సాంగ్ 830కె లైక్స్ ని దక్కించుకుని ఆల్ టైం రికార్డు కొట్టింది. అయితే వ్యూస్ పరంగా మాత్రం ఈ సాంగ్ 6.2 మిలియన్ వ్యూస్ మాత్రమే అందుకుంది.

ప్రస్తుతం ఈ సాంగ్ మొత్తంగా 10 మిలియన్ వ్యూస్ తో కొనసాగుతోంది. పలు ఇతర సినిమాలు మాత్రం 24 గంటల్లో 10 నుండి 20 మిలియన్స్ వరకు వ్యూస్ అందుకున్నవి. మొత్తంగా అయితే ఈ సాంగ్ తో ఓజి పై అందరిలో మరింతగా అంచనాలు పెరిగాయి. ఈ మూవీని దసరా పండుగ కానుకగా సెప్టెంబర్ 25న గ్రాండ్ గా పలు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

READ  తెలుగు రాష్ట్రాల టాప్ 5 ప్రీ రిలీజ్ బిజినెస్ లిస్ట్ లో 'OG'

అయితే అసలు ఛాలెంజ్ ఏమిటంటే, హరి హర వీర మల్లుతో అతిపెద్ద డిజాస్టర్ చవిచూసిన తమ హీరో పవన్ ఓజితో బిగ్గెట్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దర్శకుడు సుజీత్ దీనిని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని, తప్పకుండా మూవీ విజయం తథ్యం అని టీమ్ కూడా అభిప్రాయపడుతోంది.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories