Homeసినిమా వార్తలుRRR సీక్వెల్ కు ఎన్టీఆర్ ఒప్పుకుంటారా?

RRR సీక్వెల్ కు ఎన్టీఆర్ ఒప్పుకుంటారా?

- Advertisement -

RRR సినిమాకు సీక్వెల్ కోసం ప్లాన్ చేస్తున్నారు అనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలిచింది. రాజమౌళి RRR సినిమా అభిమానులకు ఇటీవలే ఒక ఆశను ఇచ్చారు. తన తండ్రి మరియు రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ రీమేక్ కోసం సంభావ్య ఆలోచనలపై పనిచేస్తున్నట్లు ధృవీకరించారు.

అయితే ఎన్టీఆర్ అభిమానులు ఈ సీక్వెల్‌ని అంగీకరిస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రామ్ చరణ్ ను చూపించిన దానికి తగ్గట్టుగా తమ హీరోని చూపించలేదని ఇప్పటికే సినిమా చూసి వారు నిరాశ పడ్డారు. అందువల్ల, RRR సీక్వెల్ యొక్క ప్రణాళికలను కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు ఆనందంగా స్వీకరించటం లేదు.

సినిమా విడుదలకు ముందు రాజమౌళి చాలాసార్లు చెప్పినట్లు ఆయన మెదడులో సీక్వెల్ ఆలోచన లేదు. అయితే విడుదల తర్వాత విజయేంద్ర ప్రసాద్ సమక్షంలో ఎన్టీఆర్ సీక్వెల్ అడిగారని వార్తలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా.. మరీ ముఖ్యంగా హాలీవుడ్‌లో వస్తున్న రెస్పాన్స్ చూసి రాజమౌళి సీక్వెల్‌ పై పునరాలోచనలో పడ్డారు. ఇక సినిమా ముగింపు కూడా పొడిగింపుకి స్కోప్‌ను ఇస్తుంది.

అయితే RRRలో ఎన్టీఆర్ పాత్ర చిత్రణ పై ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. హీరోలు ఇద్దరి పాత్రలు కూడా సమంగా ప్రభావం చూపుతాయని రాజమౌళి హామీ ఇచ్చినా.. సెకండాఫ్‌లో సినిమా చరణ్ వైపు మొగ్గు చూపింది.

క్లైమాక్స్‌లో కూడా రామ్‌ కు సహాయకుడిగా భీమ్‌ని చూపించడం, రామరాజును రాముడిగా చూపించడం ఎన్టీఆర్ పాత్రను తక్కువ చేసిందని ఎన్టీఆర్ అభిమానులు భావించారు.

READ  RC-15 కంటే ముందు భారతీయుడు-2 విడుదల అవుతుందా?

క్లైమాక్స్ ఫైట్‌ సీక్వెన్స్ లో మొత్తం ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ కేవలం ప్రేక్షక పాత్ర వహించినట్లు, జైలు బద్దలు కొట్టే ఫైట్‌లో కూడా ఎన్టీఆర్ పాత్రను తక్కువ చేసినట్లు అభిమానులు ఆరోపించారు. కథ పరంగా చరణ్‌కి మంచి క్యారెక్టర్‌ లభించింది. ఆ పాత్రతో, పాత్ర తాలూకు ఆశయంతో పోలిస్తే ఎన్టీఆర్‌ ఉద్దేశ్యం అంత బలంగా చూపించలేదని కూడా అన్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూసి ఎన్టీఆర్‌ అభిమానులు గుండెల్లో ఈ గాయాలను అప్పటి నుంచి మోస్తునే ఉన్నారు. ఎన్టీఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని సంతోషించినా, భీమ్‌ పాత్రకు జరిగిన అన్యాయాన్ని మాత్రం ఇప్పటికీ మరచిపోలేక పోతున్నారు. కొమరం భీమ్‌ని నిరక్షరాస్యుడిగా చూపించి, అతని ‘జల్ జంగల్ జమీన్’ నినాదాన్ని కూడా సినిమాలో రామరాజు అతనికి ఇచ్చాడని చూపించడం ఆయనను అవమానించినట్లు కొంతమంది ప్రేక్షకులు భావించారు.

ఎన్టీఆర్ క్యారెక్టర్ ను అండర్‌ప్లే చేసిన విషయంలో రాజమౌళి పై ఈ ఆరోపణలు అన్నీ కూడా ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వార్తల ప్రకారం సీక్వెల్ నిజంగా వస్తే మటుకు ఎన్టీఆర్‌ అభిమానుల భావాలను పరిగణలోకి తీసుకొని సినిమా తీస్తే మంచిది.

Follow on Google News Follow on Whatsapp

READ  రామ్ చరణ్ - మోహన్ రాజా కాంబినేషన్లో రానున్న ధ్రువ-2


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories