తెలుగు సినిమా నిర్మాతల మండలి ఇటీవల OTT రిలీజ్ ల పై కొత్త నిబంధనలు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. పెద్ద హీరోల సినిమాలు అయితే ఎనిమిది వారాలు..అదే చిన్న సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన ఆరు వారాల తరువాతే OTT రిలీజ్ ఉండాలనీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఈ సమావేశం అప్పుడే కొందరు నిర్మాతలు ఈ నిర్ణయం పట్ల అంత సుముఖంగా లేరు అని తెలియవచ్చింది. సినిమాలు ఫ్లాప్ అయినపుడు తొందరగా OTT విడుదలకు వెళ్ళే అలవాటు ఈ సంవత్సరంలో బాగా వృద్ధిలో ఉండింది.ఇప్పుడు ఈ కొత్త నిభందనలు అమలులోకి వస్తే ఆ వెసులుబాటు ఉండదు.
ఉదాహరణకు ఈ వారం రిలీజ్ అయిన సినిమాలే తీసుకుందాం..పక్కా కమర్షియల్, షికారి,తమిళ డబ్బింగ్ సినిమా ఏనుగు విడుదల అయ్యాయి. అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. మరి ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం ఈ సినిమా నిర్మాతలు ఆరు వారాల తరువాతే OTT రిలీజ్ కు పచ్చ జెండా ఊపుతారా లేక పాత పద్ధతిలో త్వరగా విడుదల చేస్తారా అనేది చూడాలి.
ఏదైనా కొత్త నిభందనలు అమలులోకి వచ్చిన తరువాత అప్పటి వరకూ వేరే పద్ధతులు అలవాటయిన వారికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది అనేది వాస్తవం.కానీ ఆ నిర్ణయాలు అందరి శ్రేయస్సు దృష్ట్యా తీసుకున్నారు కాబట్టి నిర్మాతలు కూడా అత్యాశకు పోకుండా నిభందనలు పాటిస్తే అందరికీ మంచిది.