టాలీవుడ్ నటుడు నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకుడిగా తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సరిపోదా శనివారం. ఈ మూవీకి జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీగా నిర్మించారు.
ఎస్ జె సూర్య విలన్ గా నటించిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై నాని ఫ్యాన్స్ లో ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక తాజాగా పలు ఇంటర్వూస్ లో అలానే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ, తమ టీమ్ అందరినీ సరిపోదా శనివారం మూవీ మీద ఎంతో నమ్మకం ఉందని, తప్పకుండా ఆడియన్స్, ఫ్యాన్స్ ని ఇది ఆకట్టుకుని సూపర్ హిట్ కొడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.
ఇప్పటికే దసరా, హాయ్ నాన్న వంటి మూవీస్ తో వరుసగా రెండు సక్సెస్ లు సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని, ఈ మూవీతో కూడా విజయం అందుకుని హ్యాట్రిక్ సొంతం చేసుకుంటారో లేదో తెలియాలి అంటే మరొక నాలుగు రోజులు ఆగాల్సిందే