అక్కినేని నాగ చైతన్య హీరోగా, సృజనాత్మకత కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన థాంక్యూ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. తన ఎదుగుదలకు, జీవితంలో తనని అత్యున్నత స్థానానికి కారణమైన వారిని వెతుక్కుంటూ.. వారికి కృతజ్ఞత చెప్పడానికి వెళ్ళే ఓ యువకుడు సాగించే ప్రయాణం నేపథ్యంలో సాగే ఒక హృద్యమైన కథతో ఈ సినిమా రూపొందింది. ఇందులో నాగచైతన్య మూడు డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించారు. అంతే కాకుండా ఆయన కెరీర్‌లోనే అత్యధిక థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. దానికి కారణం అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించడమే.
ఇందులో రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. బాలనటిగా సీరియల్స్ లో పేరు తెచ్చుకుని ఆ పైన హీరోయిన్ గా మారిన అవికా గోర్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. కాగా ఈ సినిమా డిజిటల్, శాటిలైల్ హక్కులు చాలా రోజుల క్రితమే అమ్ముడు పోయినట్లు సమాచారం. థాంక్యూ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా.. శాటిలైట్ హక్కులను సన్‌నెక్స్ట్ సొంతం చేసుకుంది.
ఈ వారం విడుదలైన థాంక్యూ సినిమా తొలి రోజు నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకుని, కలెక్షన్ల పరంగా భారీ పరాజయం చవి చూసింది. మామూలుగా సినిమాలు ఫ్లాప్ అవ్వడం సాధారణ విషయమే. కానీ థాంక్యూ చిత్రం రోజురోజుకూ దారుణంగా పడిపోతూ వచ్చాయి. చాలా సెంటర్లలో అసలు షేర్ ఏ రాకుండా జీరో షేర్ సినిమాగా మిగలడం అటు నిర్మాత దిల్ రాజుకు, హీరో నాగ చైతన్యకు తీవ్ర నిరాశను మిగిల్చింది.
జూలై 1 తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ నుంచి విడుదలయ్యే సినిమాల విషయంలో థియేటర్, ఓటీటీ రిలీజ్ మధ్య మినిమం ఆరు నుండి ఎనిమిది వారాలు గ్యాప్ ఉండాలని ఇటీవల నిర్మాతలు సమిష్టిగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
మొదటి నుంచీ ఈ ఓటిటి విడుదలను ఆలస్యం చేయాలనే అంశాన్ని నిర్మాత దిల్ రాజు నడిపించారు. ఇప్పుడు ఆయన నిర్మించిన చిత్రం ఇంత ఘోరమైన డిజాస్టర్ గా నిలవడంతో.. ఓటిటి విడుదల ఒప్పందానికి ఆయన కట్టుబడి ఉంటారా లేదా అన్న విషయం పై ఇండస్త్రీలో చర్చలకు దారి తీస్తుంది.
ఎందుకంటే అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలను తొందరగా ఓటిటీ విడుదల చేస్తే సదరు ఓటీటీ యాప్ ఆ నిర్మాతకు ఒప్పుకున్న అమౌంట్ కన్నా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల సినిమా ఫ్లాప్ అయినా నిర్మాత కాస్త తక్కువ నష్టాలు చూస్తాడు అన్నమాట. మరి థాంక్యూ చిత్రాన్ని తొందరగా ఓటీటీలో విడుదల చేస్తారా లేక కొత్త నిభందనలకి కట్టుబడి ఆరు వారాల తరువాత విడుదల చేస్తారా అనేది వేచి చూడాలి.
We are hiring passionate and enthusiastic content writers who can create original stories. If you are interested in full time, part time or freelancing, email us at jobs@tracktollywood.com. You need to work a 5 hour shift and be available to write articles. Kindly include your sample articles. Applications without sample articles will not be encouraged.