Home సినిమా వార్తలు Will Hari Hara Veera Mallu Release on Time ‘హరి హర వీర మల్లు’...

Will Hari Hara Veera Mallu Release on Time ‘హరి హర వీర మల్లు’ అనుకున్న టైంకే రిలీజ్ అవుతుందా ? 

hari hara veera mallu

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో పిరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హరిహర వీరమల్లు కూడా ఒకటి. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, నోరా పతేహి, నర్గీస్ ఫక్రి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. 

ఇప్పటికే చాలా వరకు సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో కలిసి జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు పార్ట్ వన్ మూవీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన మూడు గ్లింప్స్ టీజర్లు అలానే ఫస్ట్ సాంగ్ మంచి రెస్పాన్స్ అయితే అందుకున్నాయి. మూవీ నుంచి రెండవ సాంగ్ ని ఫిబ్రవరి 24 విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. 

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హరిహర వీరమల్లు మూవీకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. విషయం ఏమిటంటే ఈ మూవీని పక్కాగా మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే పలుమార్లు టీమ్ అధికారికంగా ప్రకటించింది. 

మ్యాటర్ ఏమిటంటే, పవన్ కళ్యాణ్ కి సంబంధించి కొద్దిపాటి బ్యాలెన్స్ వర్క్ పెండింగ్ ఉందని అయితే ఆయన ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉండటం వల్ల కాల్ షీట్స్ కేటాయించలేకపోతున్నారని అతి త్వరలో దానికి సంబంధించి కాల్ సీట్స్ కేటాయిస్తే వేగవంతంగా ఆయన పార్ట్ షూట్ ని పూర్తి చేసేందుకు టీం కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి పవన్ పక్కాగా బ్యాలన్స్ షూట్ ని త్వరలో పూర్తి చేస్తారో లేదో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version