Homeసినిమా వార్తలుWill Game Changer Get Good Response There 'గేమ్ చేంజర్' మరి అక్కడైనా అలరిస్తుందా ?

Will Game Changer Get Good Response There ‘గేమ్ చేంజర్’ మరి అక్కడైనా అలరిస్తుందా ?

- Advertisement -

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. ప్రారంభం నాటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీలో బాలీవుడ్ అందాల కథానాయిక కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజూ భారీ వ్యయంతో నిర్మించారు.

ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీలో ఎస్ జె సూర్య, శ్రీకాంత్, వెన్నెల కిషోర్, జయరాం తదితరులు నటించారు. ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం దాదాపుగా అన్ని ఏరియాల్లో చతికలపడింది. తమ హీరో మూవీ భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని భావించిన చరణ్ ఫ్యాన్స్ కి ఇది పెద్ద షాక్ ని ఇచ్చింది. ముఖ్యంగా పాత మూస పద్దతిలో దీనిని దర్శకుడు శంకర్ తెరకెక్కించిన విధానం మైనస్ కాగా సెకండ్ హాఫ్ చాలా సదా సీదాగా సాగడం పెద్ద దెబ్బేసింది. 

విషయం ఏమిటంటే, మరొక రెండు రోజుల్లో అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ అక్కడ కూడా ఎంత మేర రెస్పాన్స్ అందుకుంటుంది అనేది చెప్పలేని పరిస్థితి. ఓవరాల్ గా స్క్రిప్ట్ చాలా మైనస్ అయిన ఈ మూవీ ఏ ప్లాట్ ఫామ్ లో అయినా ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కష్టమే అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఓటిటి లో గేమ్ చేంజర్ ఎంతమేర ఆదరణ అందుకుంటుందో చూడాలి.

READ  Malavika Mohanan to Act with Mohanlal మోహన్ లాల్ తో నటించనున్న మాళవిక 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories