టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మాస్ యాక్షన్ విజువల్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.
మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు కలిగిన దేవర పార్ట్ 1 మూవీ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో అంచనాలు మరింతగా పెంచిన దేవర పై టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. విషయం ఏమిటంటే, ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం యుఎస్ఏ లో ప్రీ సేల్స్ బాగా జరుగుతున్నాయి.
ఇప్పటివరకు ఈ మూవీ 1.35 మిలియన్ డాలర్స్ ప్రీ సేల్స్ అందుకోగా ఇది కల్కి టోటల్ ప్రీ సేల్స్ ని దాటేస్తుందని ఇటీవల ట్రేడ్ అనలిస్టులు అంచనా వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే అది కష్టం అంటున్నారు. కల్కి 3.9 మిలియన్ డాలర్స్ సొంతం చేసుకోగా ఆ తరువాత స్థానంలో ఆర్ఆర్ఆర్ మూవీ నిలిచింది. కాగా దేవర పార్ట్ 1 మూవీ యుఎస్ఏ ప్రీ సేల్స్ లో మూడవ స్థానంలో నిలిచే అవకాశం ఉంది.