సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళిల క్రేజీ కాంబినేషన్ లో త్వరలో రూపొందనున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 పై సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఇప్పటికే ఈ మూవీలో తన పాత్ర కోసం ఫుల్ గా క్రాఫ్, గడ్డంతో పాటు బల్క్ గా బాడీని కూడా పెంచుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించనున్న ఈ మూవీని శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ అత్యధిక వ్యయంతో నిర్మించనున్నారు. ప్రస్తుతం వేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుపుకుంటున్న ఈమూవీ యొక్క షూటింగ్ 2025 జనవరి నుండి పక్కాగా ప్రారంభం అవుతుందని తాజాగా ఒక ఈవెంట్ లో భాగంగా కథకుడు విజయేంద్రప్రసాద్ తెలిపారు.
అలానే సూపర్ స్టార్ ఇమేజ్ కలిగిన మహేష్ బాబుకు కథ రాయడానికి రెండిళ్ళ సమయం పట్టిందన్నారు. కాగా మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ జనవరి నుండి షూటింగ్ అన్నారు సరే, మరి ఇంతకీ అనౌన్స్ మెంట్ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది, త్వరలోనే దానిని మేము ఆశించవచ్చా అంటూ అనేకమంది మహేష్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై పక్కాగా క్లారిటీ రావాలి అంటే జక్కన్న అండ్ టీమ్ ప్రకటించాల్సిందే అని తెలుస్తోంది.