Homeసినిమా వార్తలుBaahubali 2: బాహుబలిని ఆస్కార్ కోసం అప్లై చేయలేదని తెలిపిన నిర్మాత

Baahubali 2: బాహుబలిని ఆస్కార్ కోసం అప్లై చేయలేదని తెలిపిన నిర్మాత

- Advertisement -

బాహుబలి ఘనవిజయం వెనుక ఆ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ కీలక పాత్ర పోషించారు. తన గొప్ప విజన్, అభిరుచితో బాహుబలి ప్రపంచానికి జన్మనిచ్చినది రాజమౌళి అయితే, తన మార్కెటింగ్ చతురత, వినూత్న ఆలోచనలతో బాహుబలిని నలుదిశలా నడిపించింది శోభు యార్లగడ్డ గారే.

ప్రస్తుతం శోభు యార్లగడ్డ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రచారంలో చురుకైన పాత్ర పోషిస్తూ తన ప్రియ మిత్రుడు రాజమౌళికి సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్ ప్రపంచ వేదిక పై అవార్డులను గెలుచుకుంటుండగా, ఈ సందర్భంలో బాహుబలిని కూడా మరింత దూకుడుగా ప్రచారం చేసి ఉండాల్సిందని పలువురు ప్రభాస్ అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు కూడా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ లాంటి మార్కెటింగ్ ప్రచారం ప్రభాస్ నటించిన బాహుబలి సీరీస్ ను మరింత విస్తృతం చేయడానికి ఖచ్చితంగా దోహదపడి ఉండేదని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇదిలా ఉంటే బాహుబలిని ఆస్కార్ కు పరిగణనలోకి తీసుకోవాలని తామెప్పుడూ దరఖాస్తు చేసుకోలేదని శోభు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2017లో బాహుబలిని ఇండియన్ సినిమా నుంచి అఫీషియల్ ఎంట్రీగా ఎంచుకోకపోయినప్పటికీ, ఆర్ఆర్ఆర్ విషయంలో జరిగినట్లుగా శోభు యార్లగడ్డ అండ్ కో స్వతంత్రంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉండింది.

2017లో బాహుబలి-2ను ఇండియా యొక్క అఫీషియల్ ఎంట్రీగా ఎంపిక చేయనప్పుడు రాజమౌళి కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. ”నేను సినిమా చేసేటప్పుడు అవార్డుల గురించి ఎప్పుడూ ఆలోచించను. అది నా లక్ష్యం కాదు. ముందుగా కథతో సంతృప్తి పరచడం, ఆ తర్వాత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా చూడటం, అందులో ప్రాణం పెట్టి పని చేసిన ప్రతి ఒక్కరికీ డబ్బు సంపాదించడం ఏ నా ముఖ్యోద్దేశం అని ఈ దిగ్గజ దర్శకుడు 2017లో చెప్పారు.

READ  NTR: తన బ్యాడ్ ప్లానింగ్ తో అభిమానులని నిరుత్సాహపరుస్తున్న ఎన్టీఆర్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories