Home సినిమా వార్తలు రీమేక్‌లు చేయడం వల్ల చాలా మంది ప్రేక్షకులను కోల్పోతాం అంటున్న రామ్ చరణ్

రీమేక్‌లు చేయడం వల్ల చాలా మంది ప్రేక్షకులను కోల్పోతాం అంటున్న రామ్ చరణ్

ఇటీవల హిందూస్థాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను అనేక ప్రశ్నలు అడిగారు. అయితే అందులో ఒక ప్రశ్న మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. రీమేక్‌ సినిమాలు సాధారణంగా సినిమాకు చూసే కొంత మంది ప్రేక్షకుల శాతాన్ని కోల్పోతున్నాయని ఇంటర్వ్యూ హోస్ట్ చరణ్‌ ను అడిగారు. అందుకు మెగా పవర్ స్టార్ ఇచ్చిన స్పందనే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

OTT యుగంలో రీమేక్‌లు ఖచ్చితంగా సమస్యలను ఎదుర్కొంటాయని చరణ్ అంగీకరించారు. ఆయన ప్రకారం, ఒకసారి OTTలో సినిమా చూసిన ప్రేక్షకులు మళ్ళీ థియేటర్లలోకి అదే సినిమా వస్తే చూడటానికి ఆసక్తి చూపకపోవచ్చు. అయితే, సూపర్‌స్టార్ వంటి ఇమేజ్ ఇన్న హీరోలు రీమేక్‌లు చేయడం వల్ల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చని తన వాదనను సమర్ధించుకునెందుకు ఆయన పేర్కొన్నారు.

నిజానికి రీమేక్‌లు ఎక్కువ చేస్తారని మెగా ఫ్యామిలీకి పేరుంది. చిరంజీవి గత నాలుగు సినిమాల్లో రెండు రీమేక్‌లు చేశారు. పవన్ కళ్యాణ్ ఒరిజినల్ స్క్రిప్ట్‌ని చాలా అరుదుగా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో రీమేక్‌ల పై అడిగిన ప్రశ్నకు చరణ్‌ స్పందించడం ఆసక్తికరంగా మారింది. నిజానికి లూసిఫర్‌ రీమేక్‌ని చిరంజీవికి సూచించింది ఆయనే.

అభిమానులు కూడా రీమేక్‌లకు వ్యతిరేకంగా ఉన్నారు మరియు వారు రీమేక్‌లకు తక్కువ ఓపెనింగ్స్‌ని ఆపాదిస్తున్నారు. పేలవమైన బజ్ కారణంగా గాడ్ ఫాదర్ స్టార్ హీరో స్థాయి ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. లూసిఫర్‌ను చాలా మంది తెలుగు యువత OTTలో వీక్షించడమే అందుకు కారణం. ఇక పింక్, అయ్యప్పనుమ్ కోషియం సినిమాలకు కూడా ఇదే వర్తిస్తుంది.

ఇంట్లో తీరిగ్గా సెల్ ఫోన్ లోనే ఒరిజినల్‌ని చూసే అవకాశం ఉన్నప్పుడు, రీమేక్‌లు చేయడం ఇప్పుడు పాత కాన్సెప్ట్‌గా మారాయి. అయితే రీమేక్‌లో చాలా వరకు ఒరిజినల్‌లోని సారాంశం పోతుందని.. ఒరిజినల్‌ కంటే రీమేక్‌లు బెటర్‌గా ఉంటాయని, రిస్క్‌తో కూడుకున్నవి అని చిరంజీవి ఈ వాదనలను సమర్థించారు.

కానీ, ఒరిజినల్ ఉచితంగా అందుబాటులో ఉన్నప్పుడు, రీమేక్ చూడటానికి ఎవరికి ఆసక్తి ఉంటుంది? మెగా హీరోలు రీమేక్‌లు చేయడాన్ని అభిమానులు కూడా వ్యతిరేకిస్తున్నప్పుడు ఈ ప్రశ్నల గురించి వారు లోతుగా ఆలోచించాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version