కోలీవుడ్ స్టార్ నటుడు కార్తీ, సీనియర్ నటుడు అరవింద్ స్వామి కలిసి ప్రధాన పాత్రలు పోషిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ సత్యం సుందరం. ఇటీవల 96 వంటి హృద్యమైన ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు.
2డి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై సూర్య, జ్యోతిక గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఆడియన్స్ ని కార్తీ ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ మూవీ సెప్టెంబర్ 28న గ్రాండ్ గా తెలుగు ఆడియన్స్ ముందుకి రానుంది. తాజాగా ఈ మూవీని ప్రత్యేకంగా చూసిన తన సోదరుడు సూర్య, తనని హగ్ చేసుకుని మెచ్చుకున్నారని అన్నారు కార్తీ.
ముఖ్యంగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కార్తీ మాట్లాడుతూ, సత్యం సుందరం తన లైఫ్ లో ప్రత్యేకమైన మూవీ అని, అరవింద్ స్వామి గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలానే దర్శకుడు ప్రేమ్ కుమార్ దీనిని ఆకట్టుకునే రీతిన తెరకెక్కించారని, తప్పకుండా ఈ మూవీతో గట్టి సక్సెస్ కొడతామనే ఆశాభావం ఆయన వ్యక్తం చేసారు.