టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ హ్రితిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో యువ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ ఫ్రాంచైజ్ మూవీ వార్ 2. ఈ మూవీ పై ఎన్టీఆర్, హృతిక్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి.
యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవల గ్రాండ్ గా షూటింగ్ ప్రారంభం అయిన ఈ మూవీ ప్రస్తుతం వేగవంతంగా షెడ్యూల్స్ జరుపుకుంటోంది. ప్రధాన పాత్రధారుల మధ్య పలు భారీ యాక్షన్ సీన్స్ కొన్నాళ్ల క్రితం చిత్రీకరించిన టీమ్ త్వరలో హృతిక్ అలానే కియారా అద్వానీ ల పై ఇటలీ లో ఒక రొమాంటిక్ సాంగ్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
యాక్షన్ మూవీగా రూపొందుతోన్న వార్ 2 లో పలువురు బాలీవుడ్ నటులు కీలక పాత్రలు చేస్తుండగా ప్రీతం సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ మూవీ 2025 ఆగష్టు15న రిలీజ్ అయ్యే అవకాశం కనపడుతోంది. మరి తొలిసారిగా ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటిస్తున్న ఈమూవీ ఏ రేంజ్ సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.