Homeసమీక్షలుWaltair Veerayya Movie Review: రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయినా అంచనాలను అందుకోలేకపోయిన వాల్తేరు వీరయ్య

Waltair Veerayya Movie Review: రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయినా అంచనాలను అందుకోలేకపోయిన వాల్తేరు వీరయ్య

- Advertisement -

సినిమా: వాల్తేరు వీరయ్య
రేటింగ్: 2.75/5
తారాగణం: చిరంజీవి, శృతి హాసన్, రవితేజ, కేథరిన్, ప్రకాష్ రాజ్ తదితరులు
దర్శకుడు: బాబీ
నిర్మాత: మైత్రి మూవీ మేకర్స్
విడుదల తేదీ: 13 జనవరి 2022

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ రోజు విడుదల అయింది. ఆయన గత రెండు చిత్రాలైన ఆచార్య మరియు గాడ్ ఫాదర్ సినిమాలు అంచనాలను అందుకోలేకపోవడంతో చిరంజీవితో పాటు ఆయన అభిమానులు ఇద్దరూ ఈ ప్రాజెక్ట్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో చిరంజీవి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ వైపు మళ్లి, వింటేజ్ మెగాస్టార్ స్టైల్ ను మనకు చూపించి తన ఇమేజ్ మి పునరుద్ధరించాలనే ప్రయత్నం చేశారు. మరి ఈ సినిమాకు ఏది పనిచేసిందో, ఏది చేయలేదో తెలుసుకుందాం.

కథ:
వీరయ్య (చిరంజీవి) ఒక మత్స్యకారుడు, అతను మంచివాడు మరియు తరచుగా పోలీసు/నేవి అధికారులకు వివిధ సమస్యల పై సహాయం చేస్తూ ఉంటాడు. సోల్మన్ (బాబీ సింహా) ఒక ఇంటర్నషనల్ డాన్ పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోరాడు, సీతాపతి అనే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ (రాజేంద్ర ప్రసాద్) అతన్ని పట్టుకోవాలని నిశ్చయించుకుంటాడు. ఈ క్రమంలో అతను వాల్తేరు వీరయ్యను కలుస్తాడు, అతని సహాయంతో ఆ భయంకరమైన నేరస్థుడిని పట్టుకోవాలని యోచిస్తాడు. ఈ ప్రణాళిక ఎలా సాగుతుంది మరియు దాని వల్ల వారి జీవితాలు ఎలా పరస్పరం ముడిపడి ఉన్నాయి అనేది మిగిలిన కథ.

నటీనటులు:
చిరంజీవి ఈ సినిమా మొత్తానికి ప్రాణం పోసి తన స్ట్రాంగ్ జోన్ కి తిరిగి వచ్చారు. సినిమాలో ఆయన డ్యాన్స్ తో పాటు అనేక రకాల భావోద్వేగాలను చాలా సులభంగా వ్యక్తపరిచారు. అయితే, సినీ ప్రేమికులు లెక్కలేనన్ని చిత్రాలలో చిరు ఇవే అంశాలలో పరిపూర్ణంగా రాణించడం చూశారు మరియు మెగాస్టార్ పై ఉన్న భారీ అంచనాల కారణంగా వారు ఆయన నుంచి ఎక్కువ ఆశిస్తారు. ఇక నిన్న విడుదలైన వీరసింహారెడ్డిలో మాదిరిగానే శృతి హాసన్ కు డాన్స్ నంబర్లలో భాగం కావడం తప్ప ఈ సినిమాలో ప్రత్యేకంగా చేయడానికి ఏమీ లేదు. ఇక ఈ సినిమాలోని ముఖ్యమైన ప్రత్యేక పాత్రలో రవితేజ సెకండాఫ్ కు ప్రాణం పోశారు మరియు చిరంజీవితో తన కాంబినేషన్ సన్నివేశాలు చూడటానికి కన్నుల పండగలా ఉంటాయి. రవితేజ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ వాల్తేరు వీరయ్య లోని ఎంటర్టైన్మెంట్ డోస్ ను పెంచుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాబీ సింహా, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

విశ్లేషణ:
వాల్తేరు వీరయ్య సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో నిండిపోయింది. కాగా ఇందులో అభిమానులకు కావాల్సిన ‘పూనకాలు’ మూమెంట్స్ చాలానే ఉన్నాయి. కానీ ఇది సేఫ్ రూట్ లో ఉండటానికి తీసిన మరో రొటీన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ మరియు మెగాస్టార్ చిరంజీవి లోని నటుడికి ఆయన సామర్థ్యానికి తగిన న్యాయం చేయలేదు. రొటీన్ కథ, సన్నివేశాలు ఈ చిత్రానికి అతి పెద్ద లోపాలుగా చెప్పుకోవచ్చు. దర్శకుడు బాబీ ఈ రొటీన్ సబ్జెక్ట్ కు స్క్రీన్ ప్లే, ట్రీట్ మెంట్ లో కొత్తదనం ఆపాదించే ప్రయత్నం చేయాల్సింది.

READ  Dhamaka Review: ధమాకా సమీక్ష - రొటీన్ మాస్ ఎంటర్టైనర్

ప్లస్ పాయింట్స్:

  • చిరంజీవి, రవితేజ నటన
  • ఇంటర్వెల్ బ్లాక్
  • చిరంజీవి, రవితేజ కాంబో సీన్స్
  • ఎలివేషన్ సీన్స్
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు 2 పాటలు

మైనస్ పాయింట్స్:

  • కొన్ని చోట్ల అతకని కామెడీ
  • స్లో ఫస్ట్ హాఫ్
  • బలహీనమైన క్లైమాక్స్
  • రొటీన్ కథ, స్క్రీన్ ప్లే

తీర్పు:
వాల్తేరు వీరయ్య అనేది మెగా అభిమానులను పూర్తిగా అలరించే మరియు అంత సీరియస్ గా వ్యవహరించే సినిమా కాదు. దర్శకుడు బాబీ అభిమానుల అంచనాలకు అనుగుణంగా ఈ చిత్రాన్ని రూపొందించారు మరియు 90 ల నాటి చిరు యొక్క గ్లింప్స్ ప్రతి ఒక్కరూ ఆనందించే విధంగా ఉన్నాయి. ఈ చిత్రంలో సరదా క్షణాలు చాలానే ఉన్నాయి. అయితే దర్శకుడు బాబీ మరియు మెగాస్టార్ చిరంజీవి జడ్జ్మెంట్ ను ప్రశ్నించే సన్నివేశాలు కూడా కొన్ని ఉన్నాయి.

Follow on Google News Follow on Whatsapp

READ  Chiranjeevi: చెడు ఫలితాలు వచ్చినప్పటికీ తన సినిమాలను వరుసగా హిందీలో విడుదల చేస్తున్న చిరంజీవి


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories