వాల్తేరు వీరయ్య థియేట్రికల్ రన్ లో ఎన్నో బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేసింది. కాగా ఈ రోజు మరో అరుదైన ఘనతను సాధించింది. వైజాగ్ లోని జగదాంబ థియేటర్ తెలుగు రాష్ట్రాల్లో ఐకానిక్ సింగిల్ స్క్రీన్ లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఆ థియేటర్ లో ఇండియన్ ఎపిక్ యాక్షన్ డ్రామా ఆర్ ఆర్ ఆర్ జగదాంబ థియేటర్ లో 1.13 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ గ్రాసర్ గా నిలిచింది.
అయితే ఈ ఆదివారం కలెక్షన్స్ తో వాల్తేరు వీరయ్య ఈ రికార్డును క్రాస్ చేసి అదే థియేటర్ లో సరికొత్త ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పడం విశేషం.ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన వాల్తేరు వీరయ్య ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక చిత్రం యొక్క కలెక్షన్లను క్రాస్ చేయడం ద్వారా ఈ సినిమా ఎంత గొప్ప విజయం సాధించిందో మరోసారి రుజువు చేసింది.
థియేట్రికల్ రన్ లో కేవలం 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పాయింట్ కు చేరుకున్న ఈ చిత్రం అతి తక్కువ సమయంలోనే 100 కోట్ల షేర్ ను సాధించింది. ఇలా వాల్తేరు వీరయ్య ఒకదాని తర్వాత మరొకటి అనేక రికార్డులు నెలకొల్పి నైజాంలో 50 కోట్ల గ్రాస్ మార్కును సాధించి బాక్సాఫీస్ కలెక్షన్లలో టాలీవుడ్ టాప్ 10 సినిమాల్లో 6వ స్థానంలో నిలిచింది.
చిరంజీవి ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్రెజెన్స్, రవితేజ ఎనర్జిటిక్ అండ్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తో పాటు వారి కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ఇలా అన్ని రకాలుగా భారీ డోస్ ఎంటర్టైన్మెంట్ అందించిన వాల్తేరు వీరయ్య సినీ ప్రేమికులలో విపరీతమైన అభిమానాన్ని సంపాదించుకుంది.
బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, బాస్ పార్టీ మరియు పూనకాలు లోడింగ్ వంటి బ్లాక్ బస్టర్ పాటల ఇచ్చి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో శృతి హాసన్, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు.