మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య వీక్ డేస్ లో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తుంది. పండగ సీజన్ లో మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం సంక్రాంతి తర్వాత కూడా అన్ని ఏరియాల్లో సాలిడ్ గా తన జోరును కొనసాగించింది.
వాల్తేరు వీరయ్య మొదటి వారంలో రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, షేర్ దాదాపు రూ.95 కోట్ల వరకూ ఉంటుంది బ్రేక్ ఈవెన్ మార్క్ రూ.88 కోట్లుగా ఉన్న ఈ చిత్రం ఇప్పటికే ఆ మార్కును దాటేసి మొదటి వారంలోనే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి వరుస ఫెయిల్యూర్స్ తర్వాత స్ట్రెయిట్ సినిమాతో అయినా చిరంజీవి హిట్ కొట్టగలడా అనే సందేహం అందరిలోనూ కలిగింది కానీ వాల్తేరు వీరయ్య ఘన విజయంతో చిరంజీవి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు.
వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద వింటేజ్ మెగాస్టార్ ను తిరిగి తీసుకురావడంతో ఈ చిత్రం రెండు రోజుల్లోనే వీరసింహారెడ్డి పై భారీ ఆధిక్యం సాధించింది. చిరంజీవి, రవితేజ నటించిన ఈ సినిమా దేశీయ, ఓవర్సీస్ మార్కెట్లలో అదిరిపోయే బిజినెస్ చేస్తోంది.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన వాల్తేరు వీరయ్య లో బాస్ పార్టీ, పునకాలు లోడింగ్ పాటలు బాగా ప్రాచుర్యం పొందగా.. సినిమాలో తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మంచి పేరును తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో శ్రుతిహాసన్, కేథరిన్ థ్రెసా, బాబీ సింహా, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలలో నటించి మెప్పించారు.