ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య 69 డైరెక్ట్ సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని మరో రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 130 కోట్ల షేర్ వసూలు చేసిన ఉన్న ఈ సినిమా చిరంజీవి కెరీర్ బెస్ట్ షేర్ ను కలెక్ట్ చేసింది. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకీ లేని విధంగా బెస్ట్ రన్ ను కూడా పొందింది.
పాజిటివ్ టాక్ తో మొదలైన ఈ సినిమా హాలిడే సీజన్ ను ఉపయోగించుకుని 2023లో టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఇక ROI పరంగా చిరంజీవికి బిగ్గెస్ట్ ప్రాఫిట్ తెచ్చిన మూవీగా నిలిచింది. పైగా చిరంజీవికి 20/25/30 కోట్లకు పైగా లాభాలు అందుకున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఈ విజయంతో మెగాస్టార్ తన అభిమానులకు పెద్ద రిలీఫ్, ఆనందాన్ని ఇచ్చారు.
ఖైదీ నెం.150 తర్వాత ఆయన నటించిన మూడు సినిమాలు సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్ బయ్యర్లకు నష్టాలు తెచ్చిపెట్టగా, ఆ మూడు చిత్రాల్లో ఆచార్య మరీ భారీ నష్టాలను చవిచూసింది. బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ స్టామినా కోల్పోయాడని అందరూ భావించారు కానీ వాల్తేరు వీరయ్యతో ఆయన సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు.
సంక్రాంతికి బాలకృష్ణ వీరసింహారెడ్డితో పాటు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ విడుదలైంది. కాగా ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి వరుస పరాజయాల తర్వాత మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన మెగాస్టార్.. బాలయ్యతో జరిగిన ఈ పోరులో విజయం సాధించారు.
2023 మార్చి 3న ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోనుంది. అదే రోజు రాత్రి 9 గంటల నుంచి హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లోని సంధ్య 70 ఎంఎం థియేటర్ లో ఈ సందర్భంగా వేడుక కార్యక్రమం జరగనుంది. ఆ రోజు నైట్ షోకు మెగా అభిమానులు భారీ సంఖ్యలో వస్తారని, ఖచ్చితంగా వారు భారీ సంబరాలు జరుపుకుంటారు అని భావిస్తున్నారు.