చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా నిలకడగా టికెట్ విండో వద్ద బలంగా కొనసాగుతుంది. ఈ సంక్రాంతి సీజన్ కు ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ గా మారిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా అద్భుతమైన రన్ ను రాబడుతోంది. వాల్తేరు వీరయ్య థియేట్రికల్ రైట్స్ విలువ 88 కోట్లు.
కాగా ఈరోజు కలెక్షన్స్ తో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ను సాధిస్తుంది. ప్రస్తుతానికి వాల్తేరు వీరయ్య వరల్డ్ వైడ్ షేర్ 90 కోట్లకు చేరువలో ఉంటుంది. పైన చెప్పినట్టు ప్రీ బిజినెస్ విలువ 88 కోట్లు కాబట్టి, ఇప్పుడు ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ దిశగా పయనిస్తోందనే చెప్పాలి. ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరంజీవికి ఇదే బ్లాక్ బస్టర్ సినిమా.
సంక్రాంతి బాక్సాఫీసు వద్ద ఎంటర్టైన్మెంట్ ఎప్పుడూ గొప్పగా పనిచేస్తుంది. వాల్తేరు వీరయ్య విజయానికి ప్రధాన కారణం ఇదే అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్, సెకండాఫ్ రెండింటిలోనూ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన రెండు పాటలు కూడా సినిమాకు బాగా పనిచేశాయి.
వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో కనిపించి అలరించిన సంగతి తెలిసిందే. చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా, రవితేజకు జోడీగా కేథరిన్ థ్రెసా నటించారు. ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, బాబీ సింహా ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు.