Home సినిమా వార్తలు Waltair Veerayya: తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల షేర్ వసూలు చేసిన 6వ చిత్రంగా నిలిచిన...

Waltair Veerayya: తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల షేర్ వసూలు చేసిన 6వ చిత్రంగా నిలిచిన వాల్తేరు వీరయ్య

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికీ చాలా ఏరియాల్లో వీక్ డేస్ లో కూడా హౌస్ ఫుల్స్ తో సాలిడ్ కలెక్షన్స్ అందించిన ఈ సినిమా ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్ల షేర్ ను సాధించింది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి ఇదొక అద్భుతమైన విజయంగా చెప్పుకోవచ్చు.

పండగ తర్వాత కూడా బాక్సాఫీసు వద్ద మంచి పట్టున్న వాల్తేరు వీరయ్య ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల షేర్ క్లబ్ లో చేరింది. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల షేర్ క్లబ్ లో చేరిన చిరంజీవి తొలి సినిమా ఇదే కావడం విశేషం. అంతకు ముందు ఆయన నటించిన ఖైదీ నెంబర్ 150, సైరా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల షేర్ సాధించాయి.

తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల షేర్ సాధించిన సినిమాల లిస్ట్ ఇదే

  • బాహుబలి
  • బాహుబలి 2
  • సరిలేరు నీకెవ్వరు
  • అల వైకుంఠపురములో
  • ఆర్ఆర్ఆర్
  • వాల్తేరు వీరయ్య

ఈ చిత్రం సంక్రాంతికి బాలకృష్ణ వీరసింహారెడ్డితో పాటు విడుదలైంది. బాలయ్య, చిరంజీవిల మధ్య జరిగిన ఈ క్లాష్ లో మెగాస్టార్ చిరంజీవి విజయం సాధించి తన ఫేమస్ బాక్సాఫీస్ పుల్ ను మరోసారి చూపించారు.

బాబీ దర్శకత్వంలో రవితేజ, శృతిహాసన్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మొత్తానికి ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి నిరాశపరిచిన ఫలితాల తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి తన సత్తా చాటుకున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version