వాల్తేరు వీరయ్య సినిమా విడుదలై 4 వారాలు కావస్తున్నా ప్రేక్షకులకు మాత్రం ఇప్పటికీ ఫస్ట్ ఛాయిస్ ఇదే. ఈ చిత్రం 4 వ వారాంతంలో కొత్తగా విడుదలయిన సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసింది, ఇది అసాధారణ విజయంగా చెప్పవచ్చు.
ఈ వారం 3 కొత్త సినిమాలు రిలీజైన సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ యొక్క మైఖేల్, నాగవంశీ తీసిన బుట్టబొమ్మ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం కాగా, అవి థియేటర్లలో వాష్ అవుట్ గా నిలిచాయి. ఇక ఈ వారం విడుదలైన మరో చిత్రం రైటర్ పద్మభూషణ్ మల్టీప్లెక్స్ లతో పాటు ఓవర్సీస్ లోనూ మంచి ఆక్యుపెన్సీతో విజయవంతంగా ప్రదర్శితమైంది.
కొత్త సినిమాలు ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోకపోవడంతో వాల్తేరు వీరయ్య తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమాల పై ఆధిపత్యం చెలాయించడంతో పాటు మ్యాట్నీ, ఫస్ట్ షోలకు చాలా స్క్రీన్స్ లో హౌస్ ఫుల్స్ రికార్డ్ చేసి అన్ని సెంటర్లలో ఈ సినిమాకు కలెక్షన్స్ అదిరిపోయాయి.
ఈ సంక్రాంతికి విడుదలైన చిరంజీవి వాల్తేరు వీరయ్య.. బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ స్టార్ట్ అందుకుని రెండు వారాల పాటు అదే జోరును కొనసాగించింది. వాస్తవానికి చాలా ప్రాంతాల్లో వాల్తేరు వీరయ్య వీకెండ్స్ మినహా వీక్ డేస్ లో కూడా హౌస్ ఫుల్స్ నమోదు చేసింది. కాగా సంక్రాంతికి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో పోటీగా విడుదలైన ఈ చిత్రంతో ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి వరుస పరాజయాల తర్వాత మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన చిరు, బాలయ్యతో జరిగిన ఈ పోరులో తిరుగు లేని విజయం సాధించారు.
బాబీ దర్శకత్వంలో రవితేజ, శ్రుతిహాసన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.