Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 154వ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తుండగా, పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు అభిమానుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. చాలా రోజుల తరువాత బాసు పూర్తి మాస్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మాస్ రాజా రవితేజ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. ఆయన ఈ సినిమా షూటింగ్‌లో కూడా జాయిన్ అయ్యారు. అయితే ఈ సినిమాలో చిరు, రవితేజలు ఓ మాస్ మసాలా సాంగ్‌లో కలిసి చిందులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ స్పెషల్ సాంగ్‌లో ఓ బాలీవుడ్ హాట్ బ్యూటీని దింపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి ఊర్వశి రౌతేలాను ఈ మాస్ నెంబర్‌లో హాట్ అందాల ఆరబోతకు ఓకే చేశారట చిత్ర యూనిట్.
చిరు, రవితేజలు కలిస్తేనే మాస్.. అలాంటిది వారిద్దరు కలిసి చేసే సాంగ్ ఇంకా ఏ రేంజ్‌లో మాస్‌గా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక వారిద్దరి మధ్య అందాల భామ ఊర్వశి రౌతేలా చేసే అందాల ప్రదర్శన మరో హైలైట్ కావడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.