Homeసినిమా వార్తలుమళ్ళీ హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టిన వి.వి వినాయక్

మళ్ళీ హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టిన వి.వి వినాయక్

- Advertisement -

కొంత కాలం క్రితం దర్శకుడు వివి వినాయక్ హీరోగా తెరంగేట్రం చేస్తూ ‘సీనయ్య’ అనే సినిమాను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు కూడా విరివిగా వదిలి బాగా ప్రచారం కూడా చేశారు. అప్పట్లో తమిళ సినిమా పవర్ పాండి చిత్రానికి ఇది రీమేక్ అని వార్తలు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత అదేమీ లేదని ఇది పూర్తిగా కొత్త సినిమా అని తెలిసింది.

అయితే షూటింగ్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. దిల్ రాజు ఆ సినిమాని నిర్మించే భాధ్యత తీసుకున్నారు. అయితే ఈ చిత్రం ఎందుకు ఆగిపోయింది అనే విషయానికి కారణాలు తెలియరాలేదు.

తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం , వివి వినాయక్ మరో సినిమాతో హీరోగా రీలాంచ్ అవ్వాలని నిర్ణయించుకున్నారట. వినాయక్ తన సినిమాల ద్వారా అఖిల్, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి హీరోలను ఇదివరకు పరిచయం చేశారు. చిత్రం ఏమిటంటే, దర్శకుడిగా ఆయన తదుపరి చిత్రం బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేస్తున్నారు. ఈ సినిమా ప్రభాస్ ‘చత్రపతికి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమా అటు బెల్లంకొండ శ్రీనివాస్ , ఇటు వివి వినాయక్ ఇద్దరికీ బాలీవుడ్లో తొలి చిత్రం కావడం విశేషం.

READ  OTT: హైవే రివ్యూ

చత్రపతి రీమేక్ ను హిందీలో చిత్రీకరించి ఆ పైన తెలుగు, తమిళ భాషల్లో డబ్ చేయనున్నారు. నిర్మాత జయంతిలాల్ గదా పెన్ స్టూడియోస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల అయిన తర్వాత స్వీయ దర్శకత్వంలో ఒక సినిమాను నిర్మించి అందులో తానే నటించేందుకు వినాయక్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారని సమాచారం.

వినాయక్ ఇమేజ్ మరియు బాడీ లాంగ్వేజ్ తో పాటు ఆయన వయసుకు తగ్గ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది. వినాయక్ నటుడిగా ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవితో తీసిన ఠాగూర్ చిత్రంలో చిన్న పాత్రలో మెరిశారు. కాగా ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక వినాయక్ ఫుల్ లెంగ్త్ హీరో రోల్ లో పూర్తి స్థాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం దక్కించుకుంటారని ఆశిద్దాం.

Follow on Google News Follow on Whatsapp

READ  మెగా ఫ్యాన్స్ ను కలవరపెడుతున్న గాడ్ ఫాదర్ సినిమా పబ్లిసిటీ


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories