టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇటీవల మెహర్ రమేష్ దర్శకత్వంలో చేసిన మూవీ భోళా శంకర్. కీర్తి సురేష్ ఈ మూవీలో మెగాస్టార్ కి సోదరిగా నటించగా తమన్నా భాటియా హీరోయిన్ గా నటించారు. అయితే రిలీజ్ అనంతరం అంచనాలు అందుకోలేక భారీ డిజాస్టర్ గా నిలిచింది భోళా శంకర్.
దాని తరువాత ప్రస్తుతం యువ దర్శకుడు మల్లిడి వశిష్ట తో మెగాస్టార్ చేస్తోన్న సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విశ్వంభర. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తుండగా యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో దీనిని నిర్మిస్తోంది. ఇప్పటికే వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న విశ్వంభర నుండి ఫస్ట్ లుక్ టీజర్ ని దసరా పండుగ నాడు రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.
నిజానికి ఈ మూవీని 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు, అయితే డిసెంబర్ 20న రావాల్సిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కొంత ఆలస్యం కారణంగా వాయిదా పడి జనవరిలో సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఆ మూవీ మేకర్స్ ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దానితో విశ్వంభర ఆల్మోస్ 2025 సమ్మర్ తరువాతనే థియేటర్స్ లోకి వస్తుందని కూడా వార్తలు హల్చల్ చేసాయి.
ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం విశ్వంభర మూవీ రిలీజ్ లో ఏమాత్రం మార్పు లేదని, అలానే గేమ్ ఛేంజర్ కూడా డిసెంబర్ ఎండింగ్ లో రిలీజ్ పక్కాగా అంటున్నారు. మొత్తంగా ఒకసారేమో వాయిదా మరొకసారేమో లేదు లేదు అనుకున్న టైంకే వస్తుంది అంటూ విశ్వంభర రిలీజ్ విషయమై ఈ ట్విస్టులు మెగా ఫ్యాన్స్ లో ఆందోళన క్రియేట్ చేస్తున్నాయి.