Home సినిమా వార్తలు Viswam FDFS Audiance Response ‘విశ్వం’ FDFS పబ్లిక్ రెస్పాన్స్ 

Viswam FDFS Audiance Response ‘విశ్వం’ FDFS పబ్లిక్ రెస్పాన్స్ 

viswam

టాలీవుడ్ యాక్షన్ స్టార్ గోపీచంద్ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విశ్వం. ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా కనిపించగా కీలక పాత్రల్లో వెన్నెల కిషోర్, విటి గణేష్, పృథ్వీరాజ్, నరేష్, సునీల్, ప్రగతి తదితరులు నటించారు. 

పీపుల్ మీడియా ఫాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ సంస్థల పై గ్రాండ్ గా నిర్మితం అయిన ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఇటీవల టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఆకట్టుకుని నేడు మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చింది విశ్వం మూవీ. ఇక ఈ మూవీ యొక్క FDFS కి ఆడియన్స్ నుండి వచ్చిన రెస్పాన్స్ ని బట్టి చూస్తే పర్వాలేదని అంటున్నారు. వాస్తవానికి ఇది పక్కాగా శ్రీనువైట్ల కం బ్యాక్ మూవీ కానప్పటికీ కొంతవరకు బెటర్ అనేది ఆడియన్సు అభిప్రాయం. 

ఇక ఫస్ట్ హాఫ్ చాలావరకు ఎంటర్టైన్మెంట్ తో నడిచిన విశ్వం మూవీకి స్ట్రాంగ్ పాయింట్ లేకపోవడం మైనస్. అలానే వీక్ స్టోరీ పాయింట్ తో పాటు క్లైమాక్స్ కూడా చుట్టేసినట్లు అనిపిస్తుందని అంటున్నారు. అయితే ఓవరాల్ గా పర్వాలేదనిపించే ఈ మూవీ ఆడియన్స్ మౌత్ టాక్ ని బట్టి ఎంతమేర రాబోయే రోజుల్లో కలెక్షన్ రాబడుతుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version