టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా ప్రస్తుతం యువి క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ వ్యయంతో నిర్మితం అవుతున్న భారీ ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర.
ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ తో బింబిసార వంటి సక్సెస్ఫుల్ మూవీ తీసి హిట్ కొట్టిన యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా కీలక పాత్రల్లో సురభి, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి, కునాల్ కపూర్, శుభలేఖ సుధాకర్ నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, అనౌన్స్ మెంట్ వీడియోతో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి.
అయితే మ్యాటర్ ఏమిటంటే, రేపు దసరా పండుగ సందర్భంగా మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్. కాగా ఈ టీజర్ ని హైదరాబాద్ బాలానగర్ లోని విమల్ థియేటర్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. టీమ్ నుండి దీనికి సంబందించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. ఇక ఈ మూవీ జనవరిలో రిలీజ్ కానుండగా కొన్ని కారణాల రీత్యా సమ్మర్ కి వాయిదా పడనుందని టాక్.